యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

Dec 9, 2024 - 18:07
Dec 9, 2024 - 19:57
 0  18

అడ్డగూడూరు 09 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్ర ప్రదాయిని, ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను అడ్డగూడూరు మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టపాకాయలు కాల్చి, కేట్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వృద్దులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సోనియాగాంధీ చొరవతో సాధ్యమైందన్నారు. ఆమె జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బైరెడ్డి సందీప్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కప్పల రాజేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి మల్లేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చేడే అంబేద్కర్, యూత్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నేరటి కుమార్, మాజీ ఎంపీటీసీ గూడేపు పాండు, టీపీసీసీ నాయకులు గూడేపు నాగరాజు, రాష్ట్ర నాయకులు చేడే మహేందర్, ఆజీంపేట గ్రామశాఖ అధ్యక్షుడు కన్నెబోయిన లింగస్వామి, అలువాల శంకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు ఎండి షకీల్, సుంకరబోయిన అఖిల్, వంటేపాక బాలరాజు, బాలరాజు, డప్పు యాదగిరి, ఎలుక సైదులు, గండెల రవి, ఇటికాల గణేష్, బుడుగుండ్ల రవి, మందుల  వెంకటేష్, వంగూరి నరేష్, నసీర్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333