గిరిజన ప్రాంతాలలో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయండి

Jun 19, 2024 - 19:30
 0  12
గిరిజన ప్రాంతాలలో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయండి

గిరిజన ప్రాంతాలలో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయండి. 

ములుగు తెలంగాణ వార్త స్టాప్ రిపోర్టర్:-/ 19/ 2024:-

సమాజం నుండి సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిద్దాం అని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా & స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు.బుదవారం స్థానిక జిల్లా ఆస్పత్రిలో ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం ను పురస్కరించుకొని భారత ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా ఏర్పరచుకున్న లక్ష్యము 2024 సంవత్సరానికి సమాజం నుండి సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించాడానికి అవగాహన కార్యక్రమము, సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షల కార్యక్రమమునకు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా & స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ లతో కలిసి పాల్గోన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సికిల్ సెల్ వ్యాధి రాకుండా చూసుకోవాలని, రక్తమార్పిడి లాంటివి చాలా కష్టంగా ఉంటాయని, ఈ వ్యాధితో ఎవ్వరూ చనిపోకూడదని, వ్యాధి వచ్చిన వారికి, నిర్ధారణ జరిగిన వారికి,కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని, గ్రామాలలో వైద్య సిబ్బంది డాక్టర్లు అవగాహన కార్యక్రమాలు, రోగనిర్ధారణ శిబిరాలు నిర్వహించాలని సూచించారు.రాబోవు వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక వైద్యశాలలో వైద్యులు అలర్ట్ గా ఉండాలని, ఎవరిని కూడా ఇతర జిల్లా ఆసుపత్రి కి రెఫర్ చేయకూడదని, ప్రతి ఒక్కరికి వైద్యము అందించాలని, వైద్యశాలలో డాక్టర్స్ లేరు అను వార్తలు రాకూడదని తెలిపారు. వైద్యులు సమయపాలన పాటించాలని, నాణ్యమైన వైద్య సేవలు గిరిజన ప్రజలకు అందించాలని, అంకిత భావంతో సేవలు అందించినట్లయితే గిరిజనులు వైద్య సిబ్బందిని తమ గుండెల్లో పెట్టుకుంటారని మంత్రి పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యుక్త వయసు అమ్మాయిలలో ఎక్కువగా సికిల్ సెల్ వ్యాధి వస్తుందని, జిల్లాలో 2300 మందికి పరీక్షలు నిర్వహించగా 20 మందికి వచ్చిందని సికిల్ సెల్ వ్యాధి మీద అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, వ్యాధి రాకుండా నియంత్రించాలని, ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపించకుండా కట్టడి చేయాలని తెలిపారు. సికిల్ సెల్ జన్యు పరంగా వస్తుందని, దాన్ని రాకుండా చూసుకోవాలని, నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని, ప్రజలను కోరారు.డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ, సికిల్ సెల్ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుందని, తల్లిదండ్రులలో ఇద్దరికీ సికిల్ సెల్ వ్యాధి ఉన్నట్లయితే పిల్లలకు వస్తుందని, ఒకవేళ తల్లిదండ్రులలో ఒకరికి సికిల్ సెల్ వ్యాధి ఉండి ఇంకొకరికి లేనట్లయితే 25% వ్యాధి వస్తుందని, లేదా రాకపోవచ్చు అని, సికిల్ సెల్ ఎర్ర రక్తకణము కొడవలి రూపంలో ఉండి,రక్తహీనతకు దారితీస్తుందని, సికిల్ సెల్ వ్యాధి లక్షణాలు, రక్తహీనత,కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, తరచుగా జ్వరం వస్తుందని, చాతినొప్పి అరుదుగా ఉంటుందని, ఆయాసం వస్తుందని తెలిపారు. చికిత్సలో భాగంగా హైడ్రాక్స్ యూరియా,రక్తమార్పిడి, మూలగ మార్పిడి, పోలిక్ యాసిడ్ మాత్రలు ఉంటాయని తెలిపారు. సికిల్ సెల్ జబ్బు ఉన్నవారు పెళ్లి చేసుకోకూడదని ,ముందస్తుగా పరీక్షలు నిర్వహించుకోవాలని, దీనిపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు,ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ,ఈ సికిల్ సెల్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలని, ఇద్దరిలో సికిల్ సెల్ ఉన్నవారు పెళ్లి చేసుకోకూడదని,గిరిజనులలో ఎక్కువగా ఈ వ్యాధి వస్తుందని, పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని కోరారు.అనంతరము అక్కడ ఏర్పాటు చేసిన సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షల సెల్ లో మంత్రి రక్త పరీక్ష నమూనా ఇచ్చి వ్యాధి నిర్దారణ పరీక్షల సెల్ పని తీరును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్లాల్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ పి రవీందర్, డెమో తిరుపతయ్య, మానిటరింగ్ సూపర్వైజర్స్ దుర్గారావు, సంపత్, భాస్కర్ ,సంపత్ రావు, రాయని గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.