మధ్యలోనే ఆగిన సిసి రోడ్డు పనులు

తిరుమలగిరి 22 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :
మట్టి మొరం పోశారు వదిలేశారు ....
సీసీ రోడ్డు పనులు సాగేనా ....
చినుకు పడితే చిత్తడే....
పట్టించుకోని అధికారులు...
సూర్యపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని 3వ వార్డ్ ఆదర్శనగర్ నూనె మిల్లు నుండి మాలిపురం చౌరస్తా వరకు కలిపే సీసీ రోడ్డు పనులు గత తొమ్మిది నెలలుగా నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పట్లో కొలతలు తీసుకుని ఇళ్ళ ముందు మెట్లు జెసిపి సహాయంతో తొలగించారు మట్టి మొరం పోసి తర్వాత పనులు ఆపేశారని తెలిపారు అసలే వర్షాకాలం చినుకు పడితే చిత్తడే అవుతుంది వృద్ధులు పిల్లలు నుండి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదని గగ్గోలు పెడుతున్నారు......