సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే
మునగాల 19 జూన్ 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
మునగాల మండలం సర్వసభ్య సమావేశం శ్రీమతి ఎలక బిందు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి హాజరై కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకి కుట్టు మిషన్ లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.నేటి యువతీ యువతులు సామాజిక రుగ్మతలు డ్రగ్ ఎడక్ట్ తాగుడుకు బానిస మొబైల్ బానిసలుగా అలవాట్లపై శ్రద్ధ వహించాల్సిందిగా గ్రామాలలో వివిధ శాఖల సమన్వయంతో మాదకద్రవ్యాల నివారణ పై ఉక్కు పాదం మోపాలని ఆదేశించినారు ,వివిధ శాఖల సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది అభివృద్ధి కార్యక్రమంలో అలసత్వం చేయకుండా ప్రతి సమస్య తన దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వెంటనే పరిష్కరిస్తాను అవసరమైన నిధులను కేటాయించి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. విద్యాశాఖ సమీక్షపై పాఠశాల స్వీపర్లు కావాలని మండల విద్యాశాఖ అధికారి కోరగా సానుకూలంగా స్పందించారు, మండల విద్యుత్తు శాఖ పనితీరు మెరుగుపర్చావలసిందిగా లో వోల్టేజీ సమస్యను పరిష్కరించుటకు తెలియజేశారు.మండలంలోని చెరువులను కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని తెలియజేశారు, నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ సొంత బిల్డింగులు మంజూరి చేయవలసిందిగా ఎంపీ ఓ భూపాల్ గారు కోరారు,ఈ సమావేశం దేశ రెడ్డి జ్యోతి జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం మునగాల కోలిశెట్టి బుచ్చి పాపయ్య ఉపాధ్యక్షులు మరియు ఎంపీటీసీ తాడువాయి, శ్రీమతి ఉప్పల రజిత , కాసర్ల కల్పన, గడ్డం ఆదిలక్ష్మి, గన్న భవాని, బోడ సైదమ్మ ,సోమపoగు మోహన్, షేక్ మదర్ బి ,గురోజు మిట్టగనుపుల మండల ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు మునగాల కోదాడు ఆర్టీవో సూర్యనారాయణ ,తాసిల్దారు ఆంజనేయులు , కుంటల రమేష్ దీన్ దయాల్ మండల అభివృద్ధి అధికారి , అంజిరెడ్డి SI ,భూపాలు MPO, ప్రజా ప్రతినిధులు, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు, మండల అధికారులు , పంచాయతీ కార్యదర్శులు ,పత్రిక ప్రతినిధులు పాల్గొన్నారు.