రాష్ట్రంలోనే ములుగు జిల్లాను ప్రగతిపథంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి

Jun 19, 2024 - 19:25
 0  41
రాష్ట్రంలోనే ములుగు జిల్లాను ప్రగతిపథంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి

రాష్ట్రంలోనే ములుగు జిల్లాను ప్రగతిపథంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి 

ములుగు తెలంగాణ వార్త ప్రతినిధి జూన్/ 19 /2024 

*రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క*

*ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించాలి*

*త్రాగునీటి పైపు లైన్ లీకేజీ మరమ్మతు పనులను వెను వెంటనే పూర్తి చేయాలి*

రాష్ట్రంలోనే ములుగు జిల్లాను ప్రగతిపథంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీటిని అందించాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.బుధవారం వేంకటాపూర్ మండల కేంద్రం లో 49.53 లక్షల రూపాయల నాబార్డ్ నిధులతో నిర్మాణం చేస్తున్నా మిషన్ భగీరథ అంతర్గత త్రాగునీటి పైపు లైన్ నిర్మాణాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ , అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల పి.శ్రీజ లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలని వర్షాకాలం లో ఎక్కువగా త్రాగునీటి పైపు లైన్ లు లీకేజీ అవ్వడం వల్ల ప్రజలు కలుషిత నీరు త్రాగి అనారోగ్యం పాలు అతున్నారని ఇలాంటి ఘటనలు మన ప్రాంతం లో జరగకుండా అధికారులు అప్రమత్తమై పైపు లైన్ లికేజీలు ఉంటే వెనువెంటనే మరమత్తులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.వెంకటాపురం గ్రామం లో నూతనంగా ఏర్పాటు చేసుకున్న గృహాలకు నల్ల కలెక్షన్ లేకపోవడం తో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే 49.53 లక్షల రూపాయల నిధులతో నూతన పైపు లైన్ నిర్మాణం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటపూర్ గ్రామం లో నూతనంగా ఏర్పాటు చేసుకున్న గృహాలకు నల్ల నీటి సరఫరా అధించాలనే ఉద్దేశ్యం తో స్థానిక మంత్రి ప్రత్యేక చొరవతో నూతన పైపు లైన్ నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని దీని ద్వారా 12 వార్డ్ లలోని 450 గృహాలకు సురక్షిత మంచినీరు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ ఈ మల్లేష్ , డి ఈ అజహర్ సయ్యద్, మండల ఎంపీపీ బుర్ర రజిత, ఎంపీటీసీ లు జంగిలి శ్రీలత, పోషల అనిత , తహసిల్దార్ సదానందం తదితరులు పాల్గొన్నారు.