కామ్రేడ్ మల్లు స్వరాజ్యం వర్ధంతి వేడుకలు

నల్గొండ జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి
తెలంగాణ వార్త వేములపల్లి మార్చి 19 : ఈరోజు వేములపల్లి మండల కేంద్రంలోతెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అమరజీవి కామ్రేడ్ మల్లు స్వరాజ్యం చేసిన ఉద్యమాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు చేయాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పోలే బోయిన వరలక్ష్మి పిలుపునిచ్చారు బుధవారం వేములపల్లి మండల కార్యాలయంలో మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి సభ నిర్వహించారు ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆ నాడు దోరలుభూస్వాములకు వ్యతిరేకంగా పేద ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు నడిపారని గుర్తు చేశారు ఆయుధాన్ని చేత పట్టి పీడిత ప్రజల కోసం ఉద్యమాలు నడిపి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని కొనియాడారు రజాకాలను దొరలకు భూస్వాములకు ఆనాడే దడ పుట్టించిన వీరవనితగా నిలిచారని చెప్పారు నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రజా ఉద్యమాలకు పునాదివేయాలని పిలుపునిచ్చారు మహిళా సంఘం నాయకురాలు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని కోరారు ప్రజా పునాది బలపడినప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు ప్రజా ఉద్యమాలు బలంగా జరిగినప్పుడే మల్లు స్వరాజ్యం కు నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని తెలిపారుఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు శీలం పెద్ద పద్మ కోడి రెక్క లక్ష్మమ్మ కోడి రెక్క సైదమ్మ కోడి రెక్క శైలజ తిరుమల జానకమ్మసిఐటి మండల కమిటీ కన్వీనర్ కోడి రెక్క వెంకన్న సిఐటియు సభ్యులు కోడి రెక్క మట్టయ్య నాగయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.