ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలి

తిరుమలగిరి 23 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం పాఠశాల ప్రత్యేక అధికారిని రాపోలు సుస్మిత ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, సమాజంలో విలువలు పెంపొందేలా, కుటుంబ విలువలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి శాంతయ్య మరియు తుంగతుర్తి గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని దేశభక్తిని కలిగి ఉండాలని అన్నారు. అదేవిధంగా దేశ సంస్కృతి సాంప్రదాయంలో కాపాడుకోవాలని అన్నారు. వివిధ నేపథ్యాలు సంస్కృతులు మరియు అభిప్రాయాలను గౌరవించడం, ఇతరులకు అవసరమైనప్పుడు సహాయం చేయడం, వ్యక్తిగత మరియు సామాజిక బాధ్యతలను స్వీకరించాలన్నారు. ప్రతి ఒక్కరితో సమానంగా వ్యవహరించడంతోపాటు వివక్షతను నివారించాలన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవడం మరియు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించేలా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులుగా తమ పనులను సక్రమంగా నిర్వహించాలన్నారు. చదువుతోపాటు సామాజిక బాధ్యత ఉంటేనే సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీలు కవిత, శిరీష, కళావతి, ఇందిరా, యశోద, సునీత, తదితర ఉపాధ్యాయినిలు, విద్యార్థులు పాల్గొన్నారు......