అభిప్రాయ సేకరణ రేపటికి వాయిదా:జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్
గద్వాల్(ఆగస్టు23):-నూతనంగా ఏర్పాటు చేయనున్న రెవెన్యూ యాక్ట్ (ROR) చట్టం - 2024 పై అభిప్రాయ సేకరణ కొరకు జిల్లాలోని మేధావులు, సీనియర్ సిటిజెన్లతో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన సమావేశం అనివార్య అకరణాలవల్ల శనివారం మధ్యాహ్నం 4:00 గంటలకు మార్చబడినదని జిల్లా కలెక్టర్
బి.ఎం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఇట్టి విషయాన్ని జిల్లాలోని మేధావులు, సీనియర్ సిటిజన్ లు తదితరులు అందరూ గమనించగలరని తెలుపుతూ, ఇదే సమావేశాన్ని శనివారం సాయంత్రం 4:00 గంటలకు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే సమావేశంలో సీనియర్ సిటిజన్లు, మేధావులు, రైతు సంఘాల సభ్యులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు హాజరై తమ అమూల్యమైన సూచనలు, సలహాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.