ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పారదర్శకత ఉండాలి

 ఇందిరమ్మ కమిటీలలో ప్రభుత్వ అధికారులనే నియమించాలి

Nov 16, 2024 - 16:07
 0  16
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పారదర్శకత ఉండాలి

ఎంపిడివోకు వినతి పత్రాన్ని సమర్పించిన

బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు జీ. మణి కుమార్

జోగులాంబ గద్వాల 16 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల  పేదలకు ఇందిరమ్మ ఇళ్ళను కేటాయిస్తామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం.. ఇందిరమ్మ కమిటీలలో కాంగ్రెస్ నాయకులను నియమించడం ఎంతవరకు సమంజసమని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మణికుమార్ ప్రశ్నించారు. పేదలకు ఇళ్లను కేటాయించే అంశంలో రాష్ట్ర ప్రభుత్వము పారదర్శకతను ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలలో కాంగ్రెస్ నాయకులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ అధికారులను నియమించాలని శనివారం ఇటిక్యాల మండలం ఎంపీడీవో అజార్ మోహియుద్దీన్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీలలో పారదర్శకత లోపిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలను,అమాయకులను మోసం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంపిక చేయడానికి నియమించిన ఇందిరమ్మ కమిటీలలో కాంగ్రెస్ నాయకులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.అర్హులైన పేద ప్రజలకు ఇళ్లను కేటాయించడానికి ప్రభుత్వ అధికారులను నియమించాలని అన్నారు. ప్రభుత్వ అధికారులను నియమించడం ద్వారా పారదర్శకత ఉంటుందన్నారు. కమిటీలలో కాంగ్రెస్ నాయకులు ఉండటం వల్ల వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు తమకు వారి సమస్యలను విన్నవిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాబట్టి పేద ప్రజలు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.ఇందిరమ్మ కమిటీలలో కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వము మరొకసారి పునరాలోచించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని.. కమిటీలలో కాంగ్రెస్ నాయకులను నియమించి మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కుట్రలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఉండడం వల్ల పారదర్శకత లోపిస్తుందన్నారు. పేద ప్రజలను ప్రలోభ పెట్టకుండా పారదర్శకత పాటిస్తు అర్హులైన పేద ప్రజలకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా నియోజకవర్గంకు 3500  ఇళ్లకు ప్రత్యన్మయంగా 10  వేల ఇళ్లను మంజూరు చేసి సంబంధిత బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333