పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలి కలెక్టర్.

జోగులాంబ గద్వాల 28 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.
గద్వాల. జిల్లాలోని పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ నందు పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అయన మాట్లాడుతూ మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 40 పరీక్షా కేంద్రాల్లో 7,717 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు.పరీక్షలను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు 40 చీఫ్ సూపరిడెంట్స్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 4 రూట్ ఆఫీసర్స్, 40 డిపార్టుమెంటల్ ఆఫీసర్స్,14 సెంటర్ కస్టోడియన్స్, 40 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ నుండి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాల రవాణా,పరీక్ష అనంతరం సమాధానపత్రాల బండిల్స్‌ను పోస్టాఫీసులకు తరలింపు భద్రంగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేయాలాని పోలీస్ అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పరిశుద్య పనులను చేపట్టలని ఇందుకు మునిసిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేసి, మాల్ ప్రాక్టీసులను నిరోధించేందుకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని ఆర్డీఓ కు ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బస్సు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు,తగిన మందులతో ఆశాలను, ఎ.యన్.యంలను అందుబాటులో ఉంచాలని డీ.ఏమ్.హెచ్.ఓ కు సూచించారు. పరీక్షా సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, ఆర్డీఓ శ్రీనివాస రావు, డి.ఈ.ఓ అబ్దుల్ గని,డిప్యూటీ జెడ్పీ సీఈఓ నాగేంద్రం,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిద్దప్ప, విద్యుత్ శాఖ అధికారి ఈ.ఈ రమేష్ బాబు,మున్సిపల్ కమిషనర్లు, ఆర్టీఓ, ఆర్టీసీ, పోలీస్, పోస్ట్ ఆఫీస్ శాఖల సహయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.