గ్రూప్-3 అభ్యర్థులకు కలెక్టర్ కీలక సూచనలు

జోగులాంబ గద్వాల 16 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల ఈనెల 17,18 తేదీలలో గ్రూప్-3 పరీక్షలు జరుగుతున్నందున పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందు ( ఉ. 9.00 నుండి 9.30 గంటలకు), (మధ్యాహ్నం 2.30 గంటలకు) చేరుకోవాలని అనంతరం గేట్లను మూసి వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ నుండి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోని, దానిపై తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను అతికించాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, అనుమతించడం జరగదని తెలియజేశారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ ఐడి కార్డు తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలో 8570 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్న అవసరం మేరకు 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సెంటర్ల వారీగా సాయుధ చైతన్య ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాలలో 456, జ్ఞానప్రభ జూనియర్ కాలేజిలో 288, శ్రీ వాగ్దేవి జూనియర్ కాలేజిలో 240, సరస్వతి హై స్కూల్ ఏసి క్యాంపస్ లో 432 మరియు మెయిన్ క్యాంపస్ లో 432, నోబుల్ హై స్కూల్ ఇంగ్లీష్ మాధ్యమంలో 240, శ్రీ సరస్వతి టాలెంట్ హై స్కూల్ లో 288, ఇండో ఇంగ్లీష్ హై స్కూల్ లో 240, మాంటిస్సోరి ట్రాడిషన్స్ హై స్కూల్ లో 240, దయానంద విద్యా మందిర్ హై స్కూల్ లో 192, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లో 360, గవర్నమెంట్ జూనియర్ కాలేజి ఫర్ గర్ల్స్ లో 228, ఎం.ఎ.యల్.డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజి లో 564, గవర్నమెంట్ జూనియర్ కాలేజి లో 432, అబ్రహాం మెమోరియల్ హై స్కూల్ లో 240, విశ్వేశ్వరయ్య మెమోరియల్ హై స్కూల్ లో 231, నవోదయ డిగ్రీ కాలేజి ఫర్ ఉమెన్ లో 408, కాకతీయ హై స్కూల్ లో 240, గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ బాయ్స్ లో 360, కోటం మాణిక్యమ్మ జూనియర్ కాలేజి లో 240, విశ్వ భారతి టెక్నో ప్లే స్కూల్ లో 408, ఎస్ వి ఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజి లో 731, శ్రీ కృష్ణవేణి జూనియర్ కాలేజి లో 312, ఎస్ వి ఎం కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్ లో 384, గవర్నమెంట్ ప్రాక్టిసింగ్ హై స్కూల్ లో 384 మొత్తం 8,570 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, అభ్యర్థులంతా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలను పాటిస్తూ, ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఈ సందర్భంగా తెలియజేశారు