ఆ మహనీయుని వల్లనే ప్రజాసేవలో ఉన్న ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 15 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించిన శాసనసభ్యులు మందుల సామేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి మన అందరికీ పండగ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు ఈ మైక్ పట్టుకుని ఇలా మాట్లాడగలుగుతున్నాం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు వెనుకబడిన దళిత మరియు వెనుకబడిన వర్గాలకు మంచి చేయాలనే ఆలోచనతో రాశారు. అంబేద్కర్ ని ఏ కులానికి ఏ మతానికి అంటగట్టకూడదు ఎవరైతే వెనుక పడ్డారో ఎవరైతే అనగదొక్కబడుతున్నారో వాళ్లకు మంచి చేయాలని ఆలోచించిన గొప్ప మహానుభావుడు ఆ రోజులలో విదేశాలకు వెళ్లి లండన్ లో చదువుకొని తిరిగి వచ్చి మన కోసం రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు అటువంటి మహానుభావుడు ఆలోచనలు మనందరం పాటిస్తూ సమాజ హితానికి పాటుపడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సుంకరి జనార్ధన్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమీలాల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర యాదగిరి బర్ల సోమ నరసయ్య మార్కెట్ డైరెక్టర్ చెరుకు వేణు రావు మండల కాంగ్రెస్ నాయకులు దాచేపల్లి వెంకన్న రామోజీ గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి లింగన్న ఎల్లంల నాగరాజు నాయిని కృష్ణ భీమ నాయక్ భాస్కర్ నాయక్ మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు కన్నబోయిన మల్లయ్య చింతకాయల సుధాకర్ తిరుమణి యాదగిరి మాజీ కౌన్సిలర్లు గిల కత్తుల ప్రియులత రామ్ గౌడ్ పత్తి పురం సరిత కాంగ్రెస్ నాయకులు శేఖర్ లక్పతి వెంకన్న INTUC మండల అధ్యక్షుడు పానుగంటి గణేష్ కోపరేటివ్ డైరెక్టర్ కిష్టు నాయక్ యువజన కాంగ్రెస్ నాయకులు గూడ నాగరాజు పేరాల నరేష్ దేశ గాని నవీన్ యశ్వంత్ తరుణ్ సంతోష్ మండల NSUI అధ్యక్షులు బోడ వెంకట్ తదితరులు పాల్గొన్నారు