గండిని పూడ్చేందుకు యుద్ధ ప్రతిపాదన పనులు జరుగు ఉన్నాయి*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నబాబు*
రైతులను ఆదుకునేందుకు మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి అహర్నిశలు కృషి........
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది.....
గండిని పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.......
మాజీ ఎమ్మెల్యే రైతులను రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలి.........
ఉనికి కోల్పోతున్నాం అన్న అక్కసుతోనే ప్రభుత్వంపై విమర్శలు.........
మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి ఆదేశాలతో రెండు రోజుల్లో పనులు పూర్తి........
సాగర్ ఎడమ కాలువ వద్ద గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..........
కళ్ళు లేని కబోదిలా మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.........
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు..........
మంత్రి ఉత్తమ ఎమ్మెల్యే పద్మావతి ఆదేశాలతో నడిగూడెం మండల పరిధిలోని కాగిత రామచంద్రపురం వద్దా పాలేరు సమీపంలో సాగర్ ఎడమ కాలువకు గండిని పూడ్చేందుకు అధికారులు యుద్ధపాతిపదికనా రైతులకు నీరు అందించేందుకు 24 గంటలు కష్టపడి పని చేస్తుంటే కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కళ్ళు లేని కబోదిలా రైతులను రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు వెంకటరత్నం బాబు విమర్శించారు.బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి తో కలిసి గండి పడిన ప్రదేశం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న రెండు రోజుల్లో పనులు పూర్తి చేసి 21వ తారీకు వరకు రైతులకు సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని రైతులు సంయమనం పాటించి సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి హెలికాప్టర్లో తిరిగి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి నష్ట పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నారని అటువంటి వారిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాస్త ఆలస్యం అయినా పనులు పూర్తి నాణ్యతతో చేయాలని అధికారులకు సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతును పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప వరదలను కూడా రాజకీయంగా వాడుకోవడం తగదన్నారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే బొల్లం తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా రేయంబవళ్ళు కష్టపడుతున్న అధికారులకు శాలువా పూలదండలతో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, నెమ్మది దేవమని, యాతాకుల జ్యోతి, రావెల్ల కృష్ణారావువిద్యాసాగర్ పార వెంకటేశ్వరరావు లైటింగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు........