బహుజన ప్రజల ఆరాధ్యుడు అంబేద్కర్

బహుజన ప్రజల ఆరాధ్యుడు అంబేద్కర్
- చర్ల సీఐ ఏ రాజువర్మ
చర్ల, ఏప్రిల్ 14: అట్టడుగు, బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం, అంటరానితనం నిర్మూలన కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని చర్ల సీఐ ఏ రాజు వర్మ అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సోమవారం జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి సూచనల మేరకు మండల కమిటీ ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుడు తోటమల్ల గోపాలరావు అధ్యక్షతన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన చర్ల సీఐ ఏ రాజు వర్మ , ఎస్ ఐ ఆర్ నర్సిరెడ్డి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జరిగిన సమావేశంలో సీఐ రాజు వర్మ మాట్లాడుతూ అట్టడుగు బడుగు,బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం, అంటరానితనం నిర్మూలన కోసం నిరంతరం పోరాడిన యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజల ఆరాధ్యుడుగా కొనియాడబడే భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం బలహీన వర్గాల ప్రజలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎడెల్లి గణపతి, సీనియర్ నాయకులు తడికల లాలయ్య, కొంగూరు రమణారావు,దొడ్డా ప్రభుదాస్, కొంగూరు నరసింహారావు ( రిటైర్డ్ ఉపాధ్యాయులు), మండల గౌరవ అధ్యక్షులు మోత్కూరి ప్రభాకర్,సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జ్ బోళ్ల వినోద్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తోటమల్ల వరప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి చీదరగడ్డ రవి, భద్రాచలం నియోజకవర్గ నాయకులు కారంపూడి సాల్మన్, తోటమల్ల విజయ రావు, నిట్ట అబ్బులు, రుంజాసుమన్, తోటమల్ల కృష్ణారావు, కొంగూరు సత్యనారాయణ,రుంజా రాజా, మైపా జోగారావు, కోడి రెక్కల వెంకటేశ్వర్లు,ఇప్పా ప్రభుదాస్, చీదరగడ్డ వినోద్, మైస కాసుబాబు,కొంగూరు ప్రదీప్ కుమార్, బట్ట అనిల్, కర్రీ చింటూ, తోట అభిషేక్, రుంజ సోను,రుంజా ప్రకాష్, నిట్ట రమేష్ తదితరులు పాల్గొన్నారు.