ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎస్పీ శబరిస్
*ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎస్పీ శబరిస్*
జూలై 27 వాజేడు తెలంగాణ వార్త :- ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, పేరూరు పోలీస్ స్టేషన్ పరిదిలోని గోదావరి వరద వల్ల ముంపునకు గురి అయ్యే టేకులగూడెం గ్రామం వద్ద తెలంగాణా ఛత్తీస్ ఘడ్ 163 వ జాతీయ రహదారిని పరివేక్షించారు.గోదావరి ముంపు తగ్గేంతవరకు గోదావరి దాటే ప్రయత్నం చేయవద్దని గ్రామస్తులకు, బాటసారులకు పలు సూచనలు చేసి, ముంపునకు గురి అయ్యే కడేకల్లు, కృష్ణాపురం టేకులగూడెం గ్రామాలను సందర్శించి గోదావరి వరద ఎక్కువైతే అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనల మేరకు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్ళ వలసిందిగా సూచించారు. పేరూరు పోలీసు స్టేషన్ పరిధిలోని (గామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, సర్పంచులకు, ఉప సర్పంచులకు, అధికార ప్రతినిధులకు ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీ ఈ జూలై నెల 28 వ తేదీ నుండి ఆగష్టు 3 తేది వరకు మావోయిస్టు వారోత్సవాలు ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించారు మావోయిస్టులకు ఎవరు సహకరించవద్దని,మావోయిస్టుల కదలికలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే ఎప్పటికప్పుడు పోలీసు వారికి తెలియపరచగలరని, మావోయిస్టుల వారోత్సహాల పైన నిర్దిష్టమైన నిర్ధేశకలు ఆదేశించడమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివమ్ పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు