వర్షాలకు రాకపోకలు బంద్ అయ్యి ఇబ్బంది పడుతున్న గ్రామాలను ఆదుకోవాలి

Jul 27, 2024 - 19:46
Jul 27, 2024 - 20:31
 0  4
వర్షాలకు రాకపోకలు బంద్  అయ్యి ఇబ్బంది పడుతున్న గ్రామాలను ఆదుకోవాలి

*వర్షాలకు రాకపోకలు బంద్ అయి ఇబ్బంది పడుతున్నా గ్రామాలను ఆదుకోవాలి*

 *న్యూ డెమోక్రసీ నాయకులు ముసలి సతీష్*

జులై 27 తెలంగాణ వార్త భద్రాద్రి కొత్తగూడెం ఇంచార్జ్ :- గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం డివిజన్లో గ్రామాలకు రాకపోకలు బంద్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆహార సౌకర్యాలకు వైద్యానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్యను తక్షణమే ఐటిడిఏ పిఓ కలెక్టర్ పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్ పిలుపునిచ్చారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం డివిజన్ వెంకటాపురం వాజేడు చెర్ల దుమ్ముగూడెం మండలాలు కొన్ని ఏజెన్సీ మండలాలు పూర్తిస్థాయిలో రాకపోకలు బంద్ అయినాయి. కొన్ని గ్రామాలకు మండల కేంద్రాలకు మధ్య బ్రిడ్జిలు లేకపోవడంతో రాకపోకలు బంద్ అయినాయి దశాబ్దాలుగా గర్భిణీ స్త్రీలు మరణించిన చరిత్ర కూడా ఉందని గుర్తు చేశారు ఏప్రిల్ మే నెలలో మేము ఒకటి పత్రిక పరంగా విడుదల చేశాం. చర్ల మండలంలోని ఒక గ్రామాన్ని నివాస గృహాన్ని తరలించారు వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా పాలకుల విఫలమయ్యారు. చర్ల దుమ్ముగూడెం వెంకటాపురం వాజేడు మండలాలకు కనీస సౌకర్యాలు, వైద్య సౌకర్యం ఎంతమంది డాక్టర్లని కేటాయించాలని ఫాలో అవుతున్నారని ఆయన తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ ఆదివాసి ప్రజలే ఉండడంతో వారికి అన్యం పుణ్యం తెలియదని అంత చైతన్యవంతమైనటువంటి ప్రజలు కాదని ప్రభుత్వాధికారులే చొరవ చూపి వారికి కనీసం సౌకర్యాలు నెలకొల్పాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా ఐటీడీఏ పీఓ కలెక్టర్ జోక్యం చేసుకొని ఏజెన్సీ గ్రామాలలో వైద్య సౌకర్యాలు కనీస సౌకర్యాలు కల్పించాలని న్యూ డెమోక్రసీ తరపున కోరుతున్నాం