గొట్టిపర్తిలో ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం

తుంగతుర్తి అక్టోబర్ 2 తెలంగాణవార్త ప్రతినిధి:- తుంగతుర్తి మండలం గొట్టిపర్తిగ్రామ పంచాయతీ ఆవరణంలో బుధవారం నాడు 2025 -26 సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనులపై సభ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పంచాయతీ కార్యదర్శి సింగం శ్రీధర్ మాట్లాడుతూ... ఈ సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనులను గ్రామంలో ఏ పనులకు వినియోగించాలో వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరు జాబ్ కార్డు కలిగిన ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని అహింసా పద్ధతి లో నడిపి స్వాతంత్ర్య ఫలాలు దేశ ప్రజలకు అందించిన మహనీయుడు మహాత్మా గాంధీఅనివారియొక్క త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియచేయడం అందరి సామాజిక భాద్యత అని పలువురు నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుమ్మడవెల్లి సోమయ్య, ఏఎన్ఎం స్వాతి, ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ, సీనియర్ మేటు బండి కిరణ్ ,మాజీ వార్డ్ నెంబర్ కోతి యాకయ్య, తాళ్లపల్లి యాకయ్య, బండ్ల సాలయ్య, గ్రామ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, వివో ఏలు, తదితరులు పాల్గొన్నారు.