టార్పాలిన్ పట్టాలు అందజేత

అడ్డగూడూరు 30 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు దెబ్బ తిన్న మండల కేంద్రానికి చెందిన సత్తోజు వీరాచారి, చౌల్లరామరాం గ్రామానికి చెందిన బాకీ చంద్రమ్మ అనే నిరుపేదలకు ఆదివారము రెడ్ క్రాస్ యాదాద్రి జిల్లా డైరెక్టర్ కోమ్మిడి ప్రభాకర్ రెడ్డి టార్పాలిన్ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంజయ్య, తోట కృష్ణారెడ్డి, తోట భాస్కర్ రెడ్డి, మందుల కిరణ్ , తలపాక మహేష్ తదితరులు పాల్గొన్నారు.