విద్యార్థులందరినీ అపార్ లో నమోదు చేయాలి

విద్యార్థులందరినీ అపార్ లో నమోదు చేయాలి
ఎంఈఓ తేజవాత్ వెంకటేశ్వరరావు
వాజేడు తెలంగాణ వార్త డిసెంబర్ 23:- విద్యార్థులందరినీ అపార్ లో నమోదు చేయాలని వాజేడు మండల విద్యాధికారి తేజావత్ వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులకు సూచించారు. వాజేడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం శిక్షణ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి యొక్క పూర్తి వివరాలను ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని పిలువబడే అపార్ లో నమోదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థి యొక్క వివరాలు ఒకసారి అపార్ లో నమోదు అయితే చదువుకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు మార్క్ షీట్లు గ్రేడ్లు డిగ్రీలు అపారులో నిలువ చేయబడతాయని విద్యార్థి తనకు ఇచ్చిన 12 అంకెల కోడ్ తో ఎప్పుడైనా తన సమాచారాన్ని పొందవచ్చు అని వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులకు సూచించారు యుడైస్ ప్లస్ కు కొనసాగింపుగా ఉంటుందని కావున ఉపాధ్యాయులు విద్యార్థుల అందరి వివరాలను తప్పులు లేకుండా ఆధార్ కార్డు ప్రాతిపదికగా విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి పత్రంతో అపార్ లో సమాచారం పొందుపరచాలని తెలియజేశారు. అపార్లో నమోదైన విద్యార్థి ఒక పాఠశాల నుంచి ఇంకొక పాఠశాలకు మారాలనుకున్నప్పుడు అపార్ సులభతరం చేస్తుందని ఆయన తెలిపారు తమ దగ్గర చదివిన విద్యార్థి ప్రస్తుతం ఏ పాఠశాలలో చదువుతున్నారని కూడా అపార్ ద్వారా తెలుస్తుందని ఈ పద్ధతి ద్వారా విద్యార్థుల్లో నిలుపుదలను తగ్గించవచ్చని ఆయన సూచించారు ఉపాధ్యాయులందరూ అపార్ నమోదు శిక్షణలో పూర్తి విషయాలు తెలుసుకొని త్వరితగతిన విద్యార్థులను నమోదు చేసి జిల్లాలో వాజేడు మండలాన్ని ప్రథమ స్థానంలో ఉంచాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు అపార్ నమోదు శిక్షకులు పోరిక రవికుమార్ మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.