ఆన్లైన్ కాని లబ్ధిదారుల పరిస్థితి ఏంటి ? ??

ప్రజా పాలన ఆన్లైన్ నిర్లక్ష్యం ఎవరిది ?????
ఇల్లు లేని నిరుపేదల సంగతి ఏంటి ????
ఎంత ఆశ ఉన్న నిరాశ మిగిలింది..... !
తిరుమలగిరి మండలంలోని వివిధ గ్రామాల పరిస్థితి.....!
గ్రామ కార్యదర్శుల పనితీరు బాగోలేదా..... ????
మళ్లీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడో. ....!
తిరుమలగిరి 24 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన కార్యక్రమం ప్రవేశపెట్టి ఇళ్ళు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి దరఖాస్తులు తీసుకున్న అనంతరం వారి దరఖాస్తులు ఆన్లైన్ కాక బాధితులు లబో దిబోమంటున్నారు. తిరుమలగిరి పట్టణంలోని వివిధ గ్రామాలలో వార్డులలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ చేసిన వారికి మాత్రమే ఫోన్ చేస్తూ వారి వివరాలు సేకరిస్తున్నారు. మరి ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లు గురించి అర్జీ చేసిన వారి పేర్లను ఆన్లైన్ కాని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో గ్రామాలలో దాదాపు వంద మంది వరకు ఆన్లైన్ కాలేదని తెలిసింది. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం గురించి అర్జీ చేసిన వారి పేర్లు ఆన్లైన్ కానీ వాటిని ఆన్లైన్లో ఫీడ్ చేసి వారికి ఇందిరమ్మ ఇల్లు లబ్ధి చేకూరేటట్లు అధికారులు చేయాలని నిరుపేద ప్రజలు కోరుతున్నారు