చట్ట సభలలో వలస నిరోధక చట్టాన్ని రూపొందించాలి జీఎస్పీ డిమాండ్

చర్ల. ది 15/2/25
చర్ల మండలం శనివారం నాడు సుబ్బంపేట పంచాయతీ పరిధిలో గల ఏదిర గుట్టల శ్రీ సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ముఖ్య కార్యకర్తల సమావేశం రాష్ట్ర కార్యదర్శి పూనేమ్ సాయి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందు రాజ్యాంగం అటవీ చట్టాలు రాక ముందు నుంచే ఆదివాసులు అడవిలో సాంప్రదాయ పోడు వ్యవసాయం చేస్తూ అడవిలో పలసాయాన్ని సేకరిస్తూ జీవించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుందని అలాంటి ఆదివాసులకు ప్రత్యేకమైన ఏజెన్సీ గోండ్వానా భూభాగంలోకి విపరీతంగా వలస గిరిజనేతరులు ఏజెన్సీ భూభాగంలోకి దొడ్డిదారిన సొరబడి ఆదివాసుల హక్కులు సాంస్కృతి సంప్రదాయాలపై దాడులకు పూనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు
అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షులు ట్రంప్ వలసదారులతో అమెరికా అస్తిత్వం కనుమరుగై పోతుందని ఆదేశ ప్రథమ పౌరుడు ట్రంపు వలసలపై ఉక్కు పాదం మోపుతున్నారని. మరి షెడ్యూల్ ప్రాంతాలలో కూడా వలస గిరిజనేతరుల వలన ఆదివాసిల అస్తిత్త్వానికి పెను ప్ర మాదం పొంచి ఉన్నందున భారతదేశ ప్రథమ పౌరుడు మోడీ కూడా షెడ్యూల్ ప్రాంతాలలో వలసలు రాకుండా వలస నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు
ఐదవ షెడ్యూల్ గోండ్వానా భూభాగం మొత్తం వలసలతో నిండు పోతూ ఆదివాసీల జనాభాను మైనార్టీలో నెట్టు వేయబడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తుందని దానిలో భాగమే జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు ఖరారు చేయాలనే వలస గిరిజనేతరుల డిమాండ్ తెర పైకి వస్తుందని కావున రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల మనుగడపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లోకి ఇతర వలస గిరిజనేతరులు ఉభయ తెలుగు రాష్ట్రాలలోకి ఎవరు రాకుండా వలస నిరోధక చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ శరెం సాయికిరణ్ ఇర్ప అరుణ్ కుమార్ కోరం ముత్యాలు ఇరప అశోక్ తెల్లం సంతోష్ పూనేమ్ రవి కిరణ్ పాల్గొన్నారు.