వార్డెన్ నిర్లక్ష్యంతో ఆదివాసి విద్యార్థి మృతి
![వార్డెన్ నిర్లక్ష్యంతో ఆదివాసి విద్యార్థి మృతి](https://telanganavaartha.com/uploads/images/202502/image_870x_67b1c3c1d0879.jpg)
వార్డెన్ నిర్లక్ష్యంతో ఆదివాసి విద్యార్థి మృతి...
విద్యార్థి మృతిపై పూర్తి విచారణ జరపాలి...
నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులని వెంటనే సస్పెండ్ చేయాలి -జి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర డిమాండ్
మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం 10,లక్షలు ఎక్స్ గ్రేడ్ ప్రకటించాలి...
తెలంగాణ వార్త:-
ఆదివారం నాడు వెంకటాపురం మండలంలోని కొమరం భీం కాలనీలో గొండ్వానా సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశంలో ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్ అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిదొర పాల్గొని మాట్లాడుతూ.ఆదివాసి విద్యార్థి సోయం వినీత్ మృతి కేవలం ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆయన ఆరోపించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రూపాయలు గిరిజన ఆశ్రమ పాఠశాల కోసం ఖర్చు చేసినప్పటికీ ఒక ఆదివాసీ విద్యార్థి ప్రాణాలు కాపాడడంలో విఫలమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాజేడు మండలం పేరూరు ఆశ్రమ పాఠశాలలో గత కొన్ని రోజుల నుండి 8వ తరగతి చదువుతున్న,సోయం వినీత్ అనే విద్యార్థి జ్వరంతో బాధపడుతున్నప్పటికీ అక్కడ ఉన్న పాఠశాల వార్డెన్ అలాగే హెచ్ఎం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించారని,కేవలం ఆశా వర్కర్ ఇచ్చిన మందులతోనే గడిపారని సరైన చికిత్స అందించలేదని ఆయన మండిపడ్డారు. ఇది కేవలం పేరూరు ఆశ్రమ పాఠశాల హెచ్ఎం మరియు వార్డెన్ ఉద్యోగుల వల్లే ఈ మృతి జరిగినట్లు ఆరోపించారు.విద్యార్థి తల్లిదండ్రులకు జ్వరం వచ్చినప్పటికీ ఎవరికీ సమాచారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.
ఆశ్రమాలకు వచ్చే నిధులన్నీ అక్కడ ఉన్న వార్డెన్లు మరియు హెచ్ఎంలు దొడ్డిదారి పట్టిచ్చి పందికొక్కుల మేస్తున్నారని,గిరిజన విద్యార్థులకు మొండి చేయి చూపుతున్నారని ఆయన మండిపడ్డారు.8వ తరగతి చదువుతున్న సోయం వినీత్ మరణానికి హెడ్మాస్టర్ మరియు వార్డెన్ నిర్లక్ష్యం వల్లనే అని,వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎక్స్ గ్రేడ్ 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో జిఎస్పి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే ఐటీడీఏ ఎటునాగారం పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాల అన్నిటిని డిడి పర్యవేక్షించలని, డిడి పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి అనర్ధాలు దారితీస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిఎస్పి కార్యకర్తలు పాల్గొన్నారు