రోడ్లపై స్కూల్ బస్సుల పార్కింగ్

పాదచారులకు దారేది.?
ప్రమాదాలు జరిగిన పట్టించుకోరా ..?
నిద్రపోతున్న అధికార యంత్రాంగం...
తిరుమలగిరి 01 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
పాఠశాలలు ప్రారంభమైన ఈరోజుల్లో తిరుమలగిరి పట్టణంలో స్కూల్ బస్సుల రోడ్డుపైనే పార్కింగ్ తీవ్ర అసౌకర్యానికి కారణమవుతోంది.తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల హిల్స్ సమీపంలో గల ఫాతిమా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చెందిన బస్సులు జనగాం సూర్యాపేట జాతీయ రహదారిపై పార్కింగ్ చేయడం పట్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.ప్రధాన రహదారులపై రెండు వైపులా నిలిపిన బస్సులు ఇతర వాహనదారులకు, పాదచారులకు గతి లేకుండా చేస్తున్నాయి.పాఠశాల ప్రాంగణంలో బస్సులను నిలుపుకునేందుకు పెద్ద స్థలమే ఉండగా కావల్సుకొని నిర్లక్ష్యంగా యజమాన్యం స్కూల్ బయట రోడ్లపై పాఠశాలకు చెందిన బస్సులు నిలబడమేమిటిని ప్రయాణికులు బాటసారులు ప్రశ్నిస్తున్నారు.పోలీసు,రోడ్డు రవాణా సంస్థ అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం.పాదచారులు అడుగడుగునా ప్రమాదాల్ని ఎదుర్కొంటున్నారు. రోడ్డు కనబడని స్థితిలో బస్సుల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తూ పిల్లలు,వృద్ధులు ప్రమాదాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది.గతంలో ఈ పాఠశాల ముందు (టర్నింగ్) మూలమలుపు ఉండడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగాయని,ఎందరో మృత్యువాత పడ్డారని ఇంత నిర్లక్ష్యంగా ప్రమాదకరంగా రోడ్లపై స్కూల్ బస్ నిలిపిన యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలు వాహనదారులు కోరుతున్నారు.స్థానికులు మండిపడుతూ,“స్కూల్ బస్సులు విద్యార్థులకోసం ఉండాలి కానీ ప్రజలకు ఇబ్బందులు కలిగించడానికి కాదు. బస్సుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ చొరవ చూపాలి,” అని డిమాండ్ చేస్తున్నారు.మున్సిపల్ అధికారులు,ట్రాఫిక్ విభాగం మాత్రం ఇప్పటికీ సైలెంట్‌గా ఉండడం విమర్శలకు తావిస్తోంది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు....