ములుగు జిల్లాలో ముంపు ప్రాంతాల పరిరక్షణకై ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

Jun 17, 2024 - 21:48
Jun 18, 2024 - 10:08
 0  8
ములుగు జిల్లాలో ముంపు ప్రాంతాల పరిరక్షణకై ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

ములుగు జిల్లాలో ముంపు ప్రాంతాల పరిరక్షణకై ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

బండారు రవికుమార్. సూడి కృష్ణారెడ్డి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డిమాండ్

ములుగు స్టాప్ రిపోర్టర్ తెలంగాణ వార్త :- ఏటూరునాగారం మండల కేంద్రంలో ఎండి దావూద్ అధ్యక్షతన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి బండారి రవికుమార్ గారు, సూడి కృష్ణారెడ్డి గార్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సంయుక్తంగా మాట్లాడుతూ ములుగు జిల్లాలో గతంలో వరదలు వచ్చి కొండాయి. ప్రాజెక్ట్ నగర్ గ్రామాలలో పదిమంది మరణించారని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ఎద్దేవా చేశారు.     ఏటూర్ నాగారం నుండి మంగపేట వరకు కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. నిర్మాణానికి సర్వేలో తప్ప పనులు జరగడం లేదని గోదావరి ఉధృతంగా వస్తే గతంలో ఎదుర్కొన్న పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికీ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని వర్షం పడుతుంటే గొడుగు వెతుక్కున్న చందనంగా ఉందని ముందస్తు చర్యలు తీసుకోకుండా గోదావరి పెరుగుతుందంటే అధికారులు ప్రదక్షిణలు చేస్తుంటారని ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతేకాకుండా గతంలో వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు వచ్చి అనేకమంది జిల్లాలో మరణించినారని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా తీసుకోకుండా అనేక మంది ప్రాణాలు పోయిన తర్వాత చేతులు కాలినంక ఆకులు పట్టుకున్న చందనంగా ప్రభుత్వం మరియు అధికారుల విధానం ఉంటుందన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ అటవీ గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి పర్యవేక్షించాలని కోరారు. గత సంవత్సరం వాజేడు మండలం జగన్నాధపురం లో ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన ఆలస్యంగా వైద్య నిర్వహించిన రోగాలు తగ్గలేదని అన్నారు.    గత ప్రభుత్వం తునికాకు బోనస్ 200 కోట్లు విడుదల చేసిన ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య వలన ఈరోజుకు తునికి ఆకు కూలీలకు బోనస్ జమ కాలేదని ఈ విషయమై వెంకటాపురం. తాడువాయి. పసర కేంద్రాలలో ఫారెస్ట్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసిన అటవీ శాఖ అధికారులు స్పందించడం లేదని ఇది దుర్మార్గపు చర్యని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.   అంతేకాకుండా ములుగు జిల్లాలో పోడు భూముల సమస్య ఫారెస్ట్ రెవెన్యూ మధ్య వివాదాస్పద భూముల సమస్య 40 వేల ఎకరాలకు పైగా ఉన్నదని ఇది కూడా పట్టించు కోవడం లేదని పేర్కొన్నారు. పోడు భూములలో అటవీశాఖ అధికారులు అటవీ హక్కు పత్రాలు వచ్చిన భూముల్లో కూడా ట్రాక్టర్లతో దున్ననియడం లేదని పేర్కొన్నారు.ఇది సరికాదని టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ రోజున యాంత్రికరణ అయిన రోజుల్లో ట్రాక్టర్ల తో కాకుండా ఎలా వ్యవసాయం చేస్తారని ప్రశ్నించారు.     వెంటనే ఫారెస్ట్ అధికారులు పోడు కేంద్రాల్లో ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వాలని పోడు కేంద్రాల్లో దాడులు ఆపాలని డిమాండ్ చేశారు.        ప్రభుత్వం పై సమస్యలు పరిష్కరించని ఎడల భవిష్యత్తులో సమస్యల పరిష్కారానికై జులై. ఆగస్టు మాసంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు.     ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి. కార్యదర్శి వర్గ సభ్యులు బి రెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్, కొప్పుల రఘుపతి, పొదిళ్ల చిట్టిబాబు, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి శీను, ఎండి గఫూర్ పాషా, జాగటి చిన్న, గొంది రాజేష్, దుగ్గి చిరంజీవి ఇతరులు పాల్గొ,న్నారు