27 వార్డులో అరుదైన జాతి పాము

Jun 18, 2024 - 19:29
 0  15

భయభ్రాంతులకు గురైన ప్రజలు

వెంటనే స్పందించిన కౌన్సిలర్ 

స్నేక్ స్నాచర్ ద్వారా పాము పట్టివేత

కౌన్సిలర్ కు రుణపడి ఉంటాం: ప్రజలు


సూర్యాపేట:- సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 27వ వార్డులో అరుదైన పాము గత మూడు రోజుల నుండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది.. విషయాన్ని వార్డు ప్రజలు  వార్డు ప్రజలు కౌన్సిలర్ చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన కౌన్సిలర్ ఫోన్ ద్వారా  డీఎఫ్ఓ  సంప్రదించారు.. అనంతరం కౌన్సిలర్ కు స్నేక్ స్నాచర్ సంప్రదించాలని తెలిపాగా  కౌన్సిలర్ ఖమ్మం నుండి  స్నేక్ స్నాచర్ గోపిను  పిలిపించారు.. మంగళవారం ఉదయం 11 గంటల నుండి  సాయంత్రం 3 గంటల వరకు శ్రమించి ఎట్టకేలకు అరుదైన జాతి పామును స్నేక్ స్నాచార్ పట్టుకున్నారు.. 

కౌన్సిలర్ మాట్లాడుతూ అనంతరం వార్డ్  కౌన్సిలర్  మాట్లాడుతూ పాములను ఎవరు చంపకుండా సంబంధిత అధికారులకు తెలియజేస్తే స్నేక్ సొసైటీ వారిని పిలిపించి పట్టియడం జరుగుతుందని తెలిపారు.

డీఎఫ్ఓకి విజ్ఞప్తి స్నేక్ సొసైటీ వారికి కూడా జీతాలు కూడా లేవని... ప్రతి ఫారెస్ట్ జిల్లా కేంద్రంలో ముగ్గురు స్నేక్ స్లాచర్లు ఉండాలని కోరారు.. స్నేక్ సొసైటీ వారు అందుబాటులో ఉంటే అనేక జీవరాసులు బతుకుతాయని అన్నారు.. స్నేక్  సొసైటీ వారిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేర్చుకొని గౌరవ వేతనాలు ఇవ్వాలని కోరారు..


కౌన్సిలర్  కు ధన్యవాదములు తెలిపిన వార్డు ప్రజలు

 గత మూడు రోజుల నుంచి ఈ పాము భయభ్రాంతులకు గురి చేస్తుందని వార్డు ప్రజలు తెలిపారు. వెంటనే కౌన్సిలర్ స్పందించి పామును బంధించడంతో భయం పోయిందని  ప్రజలు కౌన్సిలర్ కు ధన్యవాదములు తెలిపారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333