బీచుపల్లి జీవనది గా ఉన్న కృష్ణమ్మ సజీవంగా.

Mar 18, 2024 - 18:39
Mar 18, 2024 - 23:55
 0  29
బీచుపల్లి జీవనది గా ఉన్న కృష్ణమ్మ సజీవంగా.
బీచుపల్లి జీవనది గా ఉన్న కృష్ణమ్మ సజీవంగా.
బీచుపల్లి జీవనది గా ఉన్న కృష్ణమ్మ సజీవంగా.

ఆదాయం ఒకటి చాలు భక్తుల సౌకర్యాలు మాకెందుకు.

దేవాదాయ శాఖ ,రెవెన్యూ శాఖ  శాఖలు ఉండి అభివృద్ధి శూన్యం.

 నిరుపయోగంగా ఉన్న ఆంజనేయస్వామి  స్నానపు గదులు, మూత్ర శాలలు. 

జోగులాంబ గద్వాల 18 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-  ఎర్రవల్లి . మండలం శ్రీశ్రీ బీచుపల్లి పవిత్ర పుణ్యక్షేత్రం 44 జాతీయ రహదారి పక్కన కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం  బీచుపల్లి ఆంజనేయస్వామి దేవాలయం  శ్రీ కోదండ రామాలయం  ఆలయాలు ఉండి ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం జీవనదిగా పిలవబడే కృష్ణా నది ప్రస్తుతం సజీవంగా కనిపిస్తున్నది. కళ్ళు తుడుచుకోవడానికి కూడా భక్తులకు చుక్కనీరు లేకుండా ఇంకిపోవడం చాలా దురదృష్టకరం భక్తులు వివిధ రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల నుండి నిత్యం రద్దీతో కూడుకున్న పుణ్యక్షేత్రం కాశీ నుండి కన్యాకుమారి వెళ్లే ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చి కృష్ణానదిలో స్నానమాచరించి తలపై నీళ్లు చల్లుకొని గంగా నది పూజ చేసిన తర్వాత శ్రీ శ్రీ బీచుపల్లి ఆంజనేయస్వామి ని దర్శించుకుని వెళ్తూ ఉంటారు అదే కాకుండా పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు ఇక్కడ కొన్ని వేల వివాహాలు జరుగుతాయి ప్రతి ఒక్కరికి ఇక్కడ  ఇంటి దైవంగా కొలుచుకుంటారు, అదే కాకుండా ఉత్తరం నుండి దక్షిణంగా ప్రవహిస్తున్న ఈ కృష్ణా నది కావడం వలన ఇక్కడ స్నానమాచరిస్తే అనేక పుణ్య కార్యక్రమాలు చేసినట్లు అని భావిస్తారు ఇంకా ఇక్కడికి ప్రముఖుల నుండి పేదవారి వరకు చనిపోయిన వారి చితభష్మం ఇక్కడ నీటిలో కలపడం ఆనవాయితీ . ఇక్కడ స్థానికులు ఎన్నో ఏళ్ల నుండి మేము మొదటిసారిగా ఇంతటి ఘోరమైన పరిస్థితిని చూస్తున్నాము ఇప్పటివరకు ఈ విధంగా ఎన్నడు కాలేదు. మే నెలలో జరిగే ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతుంది.కనీసం ఇక్కడికి వచ్చే భక్తులకు దేవాదాయ శాఖ కానీ,  రెవిన్యూ డిపార్ట్మెంట్ , ఉన్నతాధికారులు కానీ, శ్రీ శ్రీ కోదండ రామాలయం ట్రస్టు వారు కానీఎవరు కూడా కనీస సౌకర్యాలు స్నానం చేయడానికి కానీ ఎలాంటి సదుపాయాలు కల్పించకపోవడం చాలా బాధాకరం . కనీసం ఇక్కడికి వచ్చి అడిగే నాథుడే  దాదాపు 40 సంవత్సరాల క్రితం కట్టించిన చిన్న వాటర్ ట్యాంక్ తో అసౌకర్యంగా ఉన్న భక్తులు దాన్ని వాడుతున్నారు దానిని పుననిర్మాణం కూడా చేయలేదు. అనేక సమస్యలు ఇక్కడ తాండవిస్తున్న కూడా ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ స్పందించరు ఎందుకో మరి అని భక్తులు వాపోతున్నారు. మరి ఈ పరిస్థితి ఎందుకు అని అడగగాఅంతటి పవిత్రమైన ఈ కృష్ణా నది పైన జూరాల ప్రాజెక్టు నిర్మించడం వలన ఇక్కడ చుక్క నీరు కూడా రాకుండా అడ్డుకట్టు పడ్డది . అప్పుడప్పుడు ఎలక్ట్రికల్ పవర్ వాటర్ కూడా వచ్చేవి అవి కూడా వదలడం లేదు అదే కాకుండా ఇక్కడ స్థానికంగా మత్స్యకారులు దాదాపు 200 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉంటాయి అలాగే నది తీరం వెంబడి దాదాపు అల్లంపూర్ నియోజకవర్గం మొత్తం ఒక వెయ్యి కుటుంబాలు ఈ నదిపైనే వారి వృత్తులతో ఆధారపడి ఉన్నారు అలాంటి వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది ఇంతటి దుస్థితి మేము ఎప్పుడు అనుభవించలేదు కావున అధికారులు అందరూ పై అన్నియు దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఇక్కడ వాటర్ స్టోరేజ్ కావడానికి కనీసం చర్యలు తీసుకోవాలి భక్తులకు వెంటనే స్థానాలు చేయడానికి వాటర్ సదుపాయం కల్పించాలని. జిల్లా కలెక్టర్ వీటి పైన దృష్టి ఉంచి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State