బి ఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తిరుమలగిరి చౌరస్తాలో ఘర్షణ

Aug 22, 2024 - 21:42
Aug 22, 2024 - 23:31
 0  662
బి ఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తిరుమలగిరి చౌరస్తాలో ఘర్షణ
బి ఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తిరుమలగిరి చౌరస్తాలో ఘర్షణ
బి ఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తిరుమలగిరి చౌరస్తాలో ఘర్షణ

రణభూమిగా మారిన తిరుమలగిరి

బిఆర్ఎస్ ధర్నా.  శిబిరంపై కోడిగుడ్లు, రాళ్లు, టపాకాయలు

ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు కోడిగుడ్లతో దాడి

ఇరువర్గ కార్యకర్తలకు పలువురికి తీవ్ర గాయాలు

బస్సు ప్రయాణికులు తప్పిన ప్రమాదం,

బి ఆర్ ఎస్ పార్టీ  కార్యకర్తలను బాధితులను పరామర్శించిన

మాజీమంత్రి గుంటగంట్ల జగదీశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించిన

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు

 ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘ నాయకులు

తిరుమలగిరి 23 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గురువారం రణ భూమిని తలపించే మాదిరిగా ఒకరిపై ఒకరు రాళ్లు, కోడిగుడ్లు రువ్వుకున్న సంఘటన జరిగింది.రైతు రుణమాఫీని పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు గురువారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఆ పార్టీ తలపెట్టిన రుణం పేరుతో నిర్వహించిన ధర్నా రణభూమిగా మారింది. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

అంతకుముందే తెలంగాణ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బిఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రసంగిస్తుండగా. పది సంవత్సరాలపాటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని  ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ కేడ్లను తన్నుకొని రావడానికి ప్రయత్నించడంతో నాగారం సీఐ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిలిపివేశారు, దీంతో బిఆర్ఎస్ శిబిరం వైపు కొంతమంది  వ్యక్తులు రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు బాంబులు వేయడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది.

ఏ క్షణాన ఏం జరుగుతుందోనని అక్కడ బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు భయాందోళనలతో అటు ఇటు పరుగులు తీశారు. హైదరాబాదు నుండి వెళ్తున్న రెండు బస్సులకు పెద్ద ప్రమాదం తప్పింది.  నాగారం సిఐ రఘువీర్ రెడ్డి తిరుమలగిరి ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో ఆందోళనకారులను అడ్డుకొని బస్సులకు ప్రమాదం జరగకుండా అక్కడి నుండి పంపించేశారు. గుర్తు తెలియని వ్యక్తులు రువ్విన కోడిగుడ్లతో బస్సు అద్దాలకు తగిలిన ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం ఇరు వర్గాల నినాదాలు ఘర్షణలు తోపులాట బాణా సంచాలు కోడుగుడ్డు రాళ్లు వేసుకోవడంతో ఆ ప్రాంతమంతా రణ భూమిగా మారి ఏ క్షణాన ఏం జరుగుతుందని భయాందోళన చెందారు.

కాంగ్రెస్ కార్యకర్తలు, బిఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు కోడిగుడ్లు రువ్వు కోవడంతో పోలీసులు అక్కడ ఉన్న టెంట్లు కాలీ  చేయించి  బిఆర్ఎస్ వారిని అక్కడి నుండి పంపించేశారు. గుర్తుతెలియని వ్యక్తులు వేసిన రాళ్లతో కొంతమందికి స్వల్ప గాయాలైనాయి కాగా సూర్యాపేట డిఎస్పి రవి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు రుణమాఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం అక్కడి నుండి ఘర్షణ సమయంలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలు ధరావత్ జుమ్మిలాల్ నాయిని కృష్ణ  గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఏదేమైనా పోలీసుల సమన్వయంతో ఎలాంటి  నష్టం జరగలేదు.

 బాధితుల పరామర్శ

కాంగ్రెస్  టిఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన దాడిలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు పెరుమాండ్ల పురుషోత్తం మరియు పొదిళ్ల  అంజయ్య లకు  గాయాలు కాగా సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు గుంటకండ్ల  జగదీశ్ రెడ్డి తిరుమలగిరి కి చేరుకొని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో మోసపోయిన రైతులకు మద్దతుగా అన్ని నియోజకవర్గాలలో శాంతియుతమైన పద్ధతులలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా రెండు లక్షల వరకు ఉన్న రుణాలు అన్ని మాఫీ చేయాలని, మొత్తం రైతుల సంఖ్య ఎంతో చెప్పాలని చెప్తూ గతంలో రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న నాడే మాఫీ చేస్తానని చెప్పి మాటతప్పి నెలల వాయిదాలు పెట్టుకుంటూ చివరిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కొరకు దేవుళ్ళపై కూడా ఒట్టు పెట్టి భద్రాద్రి రాముల వారి సాక్షిగా వైరాలో సభ పెట్టి రైతులందరికీ పూర్తిగా  అని చెప్పడం పూర్తిగ అబద్ధం అన్నారు. దేవునిపై ఒట్టు వేసి దేవున్ని కూడా మోసం చేశారని, దేవుళ్లాంటి  రైతాంగాన్ని కూడా మోసం చేశారని అన్నారు. ఆగస్టు 15 కల్లా మొత్తం రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇంకా 17 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని మంత్రులు చెప్పడం సిగ్గుచేటని అన్నారు.

ప్రభుత్వం చేతిలో మోసపోయిన ప్రజలందరి  వైపున ప్రతిపక్షంగా నిలబడ్డ మా బాధ్యత అని  అన్నారు. రైతుబంధు విషయంలో కూడా రైతు భరోసా వెంటనే ఇస్తా అని వాటిలో కూడా మోసం చేశారన్నారు. ఈ విధంగా రైతుల పక్షాన నిలబడి రుణమాఫీ చేయాలని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే దుర్మార్గంగా రాళ్లతో, గుడ్లతో, దాడులు చేయడం, బాంబులు వేయడం సరికాదన్నారు. ఇలాంటి చిల్లర దాడులకు చిల్లర వేషాలకు భయపడేది లేదన్నారు. ఇదంతా రైతులను పక్కదారి పట్టించడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఇది ప్రత్యక్షంగా ప్రభుత్వం పైనుండి చేయించిన పనే  అన్నారు. జిల్లావ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరు ఎవరు కూడా తొందరపడకూడదని విజ్ఞప్తి చేశారు. ఓపికతో ఎదురు నిలబడదాం దాడులను ఎదుర్కొందాం అన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, ఎస్ ఎ రజాక్, కొమినేని సతీష్ కుమార్, కల్లేట్లపల్లి శోభన్ బాబు,కందుకూరి బాబు నాని, నాగార్జున, తదితర బి ఆర్ ఎస్  నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

కాంగ్రెస్ పార్టీ నాయకులు నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలపాలై వారిని ఆసుపత్రిలో పరామర్శించి కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్సోజి నరేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ప్రతి సంవత్సరాల పాటు పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడు రైతులు ఆదుకున్న పాపాన పోలేదు అందుకోసం ఈరోజు టిఆర్ఎస్ పార్టీని పాతాళ లోకంలో తొక్కారు ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ప్రజలు వారిని ఆశీర్వదించలేదు రైతులను ఆదుకున్నట్లయితే ఈరోజు ప్రభుత్వంలో వారు ఉండేది పట్టించుకోలేదు

కాబట్టే వారిని ప్రజలు పట్టించుకోలేదు అని అన్నారు గత పది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వం  తెలంగాణ రైతులను మోసం చేసిన ప్రభుత్వం నేడు రోడ్డుపైన ధర్నాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు మీరు వెంట కాంగ్రెస్ నాయకులు సుంకరి జనార్ధన్  చాగంటి రాములు బత్తుల శ్రీను ఎన్ ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034