పేరూరు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి సోయం నవీన్ మృతి

*పేరూరు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి సోయం వినీత్ మృతి*
వెంకటాపురం నూగూరు, తెలంగాణ వార్త : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గిరిజన బాలుర ఆశ్రమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న సోయం వినీత్ సకాలంలో వైద్య అందక మృతి చెందాడని ఆదివారం పేరూరు పాఠశాల ఎదుట విద్యార్థి బంధువులు, గిరిజన సంఘాలు, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిం చారు. తమ కుమారుని ఆరోగ్యము పట్ల ఉపాద్యాయులు సమాచారం ఇవ్వలేదు అని ఆ కారణంగానే విద్యార్థి వినీత్ మృతి చెందాడని నవనిర్మాణ సేన అధ్యక్షులు కొరస నరసింహమూర్తి, ఇంకా పలు గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న, వినీత్ బంధువులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పాఠశాల ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై ములుగు జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వెంటనే విచారణ నిర్వహించి పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.