సాతుపాటీ అరవింద్ కుమార్@సోను కి చెక్ పెట్టిన పడమట పోలీసులు
ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి :-సాతుపాటి అరవింద్ కుమార్@ సోను కి చెక్ పెట్టిన పటమట పోలీసులు
Ukలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని మోసం చేసి లక్షలాది రూపాయలు దండుకొని మోసం చేసిన సాతుపాటి అరవింద్ కుమార్@ సోను పై సుమారుగా 6 కేసులు దాకా ఉన్నట్లు తెలుస్తోంది
తాజాగా కళ్యాణి అనే మహిళ పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా, 409 r/w 34, 420 సెక్షన్ల తో FiR 276/2024 కేసు నమోదు..
పడమట సీఐ పవన్ కిషోర్ ఎంతో నిజాయితీగా వ్యవహరించి బాధితుల పక్షాన ఉన్నారు
ఇప్పటికే సాతుపాటి అరవింద్ కుమార్@ సోను, రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని..పోలీసులు సోను ని పట్టుకున్నప్పుడల్లా కొంతమంది ఎమ్మెల్యేల పేరు చెప్పి పోలీసుల ను సైతం బెదిరిస్తూ ఉంటాడని గుసగుసలు బలంగా వినపడుతున్నాయి...
సాతుపాటి అరవింద్ కుమార్ @సోనూ పై ఉన్న కేసులు వివరాలు అతని మోసాల గురించి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ సీరియస్ గా ఉన్నారని, టిడిపి పార్టీ మోసాలు చేసే 420 లను ప్రోత్సహించదని, ఇక మీదట మా ఇంటి వైపు గాని పార్టీ కార్యాలయం వైపు కానీ రావద్దని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
పటమట పోలీసులు,సాతుపాటి అరవింద్ కుమార్@ సోను ని అరెస్ట్ చూయించినట్లు తెలుస్తోంది,రిమాండ్ కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం
రాజకీయ నాయకుల ఒత్తిళ్లను లెక్కచేయకుండా తన విధుల పట్ల ఎంతో నిజాయితీగా వ్యవహరిస్తూ బాధితులు పక్షాన నిలబడ్డ పటమట సిఐ పవన్ కిషోర్, కి కృతజ్ఞతలు తెలుపుతున్న బాధితులు