అంతా మా ఇష్టం సమయపాలన పాటించని అడ్డగూడూరు వైన్స్ షాపు*
అడ్డగూడూరు13 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని వైన్ షాపు మొండి వైఖరి టైం అయిపోయినంక తెరిచి ఉన్న వైన్ షాప్ అడ్డగూడూరు మండలంలో చోటు చేసుకుంది.చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ఆప్కారి శాఖ
అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎస్ ఎల్ ఎన్ ఎస్ వైన్ షాపు మరియు లక్ష్మీ మచ్చగిరి వైన్స్ ఒక షాపు సమయ పాలన పాటిస్తే మరో షాపు సమయపాలన పాటించదు. ఇది కొన్ని నెలలుగా గడుస్తున్నటువంటి వైనం ఆయన చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ఆప్కారి శాఖ మండలంలో ఉన్నటువంటి వైన్సులు తన ఇష్టానుసారంగా సమయపాలన పాటించకుండా రాత్రి తొమ్మిది దాటిన తర్వాత కూడా మధ్య అమ్మకాలను నిర్వహిస్తున్నారు.కేవలం ఆప్కారి శాఖ సమయపాలన మాటలు వరకే పరిమితమైందా? అవుననే అంటున్నాయి అడ్డగూడూరు మండలం వైన్ షాపులు ఈ పరిస్థితిని చూసినట్లయితే తమకు ఎవరు అడ్డం లేరని తమకు అడ్డు చెప్పే ఆఫీసర్స్ ఎవరూ లేరనే విధంగా 3బీర్లు 6 కోటర్లు అనే విధంగా నడుస్తుంది.అడ్డగూడూరు మండలం వైన్ షాపుల యొక్క దందా అంతా మా ఇష్టం అన్న విధంగానే వైన్స్ షాపు యజమానులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మద్యం ప్రియులకు టైం లేదు మందు ఉంది అనే విధంగా కనిపిస్తుంది. సమయపాలన పాటించకుండా మధ్య అమ్మకాలు నిర్వహిస్తున్నటువంటి ఇట్టి వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు తెలియజేస్తున్నారు.టైం అయిపోయిన వైన్ షాపులు తెరిసి ఉండడం వల్ల వినియోగదారులు మత్తులో ఉండి చీకటిలో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదాలకు గురై తమ ప్రాణాలను కోల్పోయి కుటుంబానికి ఆవేదన మిగులుస్తున్నారు.ఇప్పటికైనా ఆప్కారి శాఖ మేల్కొని అడ్డగూడూరు మండల వైన్ షాపులపై నిఘా పెంచి వినియోగదారుల జీవితాలను కాపాడవలసిన బాధ్యత ఆప్కారి శాఖకు ఉన్నది. కావున అడ్డగూడూరు మండలంలోని వైన్సుల సమయపాలన పాటించే విధంగా ఆప్కారి శాఖ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.