నిధులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు

ఆమనగల్లు గ్రామపంచాయతీ రికార్డులు సీజ్ చేసిన ఎంపీఓ జయలలిత
తెలంగాణ వార్త వేములపల్లి మార్చి 21: నల్గొండ జిల్లా వేములపల్లి మండలంఅమనగల్లు గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని ఎంపీఓ జయలలిత అన్నారువేములపల్లి మండలంలోని అమనగల్లు గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని అమనగల్లు గ్రామ ప్రజలు ఇటీవల మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కు 2024 నవంబర్ 06 తేదీన ఫిర్యాదు చెయ్యగాడిఎల్పిఓ ఆదేశాల మేరకు వేములపల్లి మండల పంచాయతీ అధికారి జయలలిత శుక్రవారం ఆమనగల్లు గ్రామపంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీల్లో జరిగిన అభివృద్ధి పనులునిధుల దుర్వినియోగం నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామన్నారువారి ఆదేశానుసారం తదుపరి చర్య రికార్డులను డిఎల్పిఓ కు సమర్పిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆమనగల్లు పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి పాల్గొన్నారు.