**సంఘ ప్రతిష్టను మరింత పెంచండి.... తుమ్మల యుగంధర్*

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : సంఘ ప్రతిష్టను మరింత పెంచండి....తుమ్మల
ఖమ్మం : సేవా కార్యక్రమంల ద్వారా సంఘ ప్రతిష్టను మరింత పెంచాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ పేర్కొన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన కమ్మ మహాజన సంఘం కమిటీని స్వర్ణ భారతి కల్యాణ మండపంలో గురువారం ఆయన ప్రత్యేకంగా కలిసి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో మంది పెద్దల సహకారంతో ఏర్పడిన ఈ సంఘం ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నదన్నారు. ఖమ్మoలో నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటుచేసి యువతకు అవకాశాలపై శిక్షణ ఇవ్వాలని, రాజకీయాలకు అతీతంగా సంఘం పనిచేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని చెప్పారు. భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండేలా నూతన కమిటీ పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా తాము చేపట్టబోయే కార్యక్రమాలను కమిటీ సభ్యులు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కొల్లు రఘు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చావా రాము, వైస్ ప్రెసిడెంట్ కర్ణాటి రమాదేవి, జాయింట్ సెక్రెటరీ వజ్జా శ్రీనివాసరావు, కోశాధికారి తుళ్లూరి నిర్మల, కార్యవర్గ సభ్యులు మోతుకూరి సత్యనారాయణ, పోతినేని భూమేశ్వర్ రావు, కోలేటి నవీన్, మేదరమెట్ల స్వరూపరాణి, నల్లమల ఆనంద్, నంబూరి ప్రసాద్, తుమ్మలపల్లి నాగేశ్వరావు, కమ్మ సంఘం మాజీ అధ్యక్షులు వేజెళ్ళ సురేష్, చేతన ఫౌండేషన్ అధినేత వెనెగళ్ల రవి కుమార్, తాళ్ళూరి మురళీకృష్ణ, బండి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.