షీ టీమ్స్ పై అవగాహన 

Mar 22, 2024 - 19:42
 0  3
 షీ టీమ్స్ పై అవగాహన 
 షీ టీమ్స్ పై అవగాహన 
 షీ టీమ్స్ పై అవగాహన 
 షీ టీమ్స్ పై అవగాహన 

గరిడేపల్లి  PS పరిది. ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు గరిడేపల్లి PS పరిది గడ్డిపల్లి ఆదర్శ పాఠశాలలో  జిల్లా షీ టీమ్స్, పోలీసు,  కళాభృందం అధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

మహిళల, విద్యార్థులు రక్షణ చట్టాలు, విద్యా విధానాలు, సమస్యలను అధిగమించడం, సోషల్ మీడియా, ఇంటర్నెట్ సద్వినియోగం లాంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు వత్తిడిని అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలి, లక్ష్యం కోసం కృషి చేయాలని గరిడేపల్లి SI నరేష్ తెలిపినారు. 

షీ టీమ్స్ SI ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారి అధ్వర్యంలో మహిళ రక్షణపై పటిష్టంగా పని చేస్తున్నామని, విద్యార్థులు సమస్యలు ఉంటే అధ్యాపకుల దృష్టికి, అధికారుల దృష్టి తేవాలని, మానసిక దైర్యం కలిగి ఉండాలని, అనుకూల, ప్రతికూల సమయాల్లో స్పందించేలా అవగాహన కలిగి ఉండాలని తెలిపినారు. తల్లిదండ్రుల కోరికలను, కళలను నెరవేర్చాల్సి బాధ్యత మనపై ఉన్నది అని గుర్తు చేశారు. ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురు కావద్దు, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా, ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు. ఇతరులు ఆశ చూపితే వారి ఆకర్షితులు కావద్దు అని తెలిపినారు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కొరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.

పోలీసు  కళబృందం వారు సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం నందు ఆదర్శ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ భార్గవి, షీ టీం హెడ్ కానిస్టేబుల్స్ జాఫర్, యల్లారెడ్డి, పోలీస్ సిబ్బంది HC  సత్యనారాయణ,శ్రీనివాసరావు,భాస్కర్, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపి,చారి, క్రిష్ణ ఉపాధ్యాయసిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333