ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలి. సీఐటీయూ జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్
తెలంగాణ వార్త మాడుగులపల్లి మార్చి 21 : నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం పాములపాడు గ్రామంలో ఈరోజుఆశావర్కర్ల న్యాయమైన సమస్యలు అన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్ డిమాండ్ చేశారుశుక్రవారం పాములపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశావర్కర్లు ధర్నా నిర్వహించి అనంతరం ఆసుపత్రి డాక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశావర్కర్ల కు 26000 రూ.ల కనీస వేతనం ఇవ్వాలన్నారు.పీఎఫ్ , ఈఎస్ఐ తో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాలన్నారుపెండింగ్ లో ఉన్న పల్స్ పోలియో లెప్రసీ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారుసంవత్సరానికి 2 జతల యూనిఫాం ఉచితంగా ఇవ్వాలనిటీబీ టెస్టులకు సెపరేట్ గా వర్కర్ ను నియమించాలని డిమాండ్ చేశారురాష్ట్ర ప్రభుత్వం ఆశావర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కోడిరెక్క వెంకన్న,ఆశావర్కర్లు కోటమ్మ,సైదమ్మ, రజిత,గోవర్థన,సరిత,శోభ,వెంకటమ్మ,గణిత,కవిత తదితరులు పాల్గొన్నారు.