జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. కారణం అదేనంటూ చర్చ..

Mar 6, 2025 - 22:09
 0  16
జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. కారణం అదేనంటూ చర్చ..

సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సుమారు అరగంటకు పైగా వీరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీపై ప్రభుత్వ వర్గాలలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జానారెడ్డిని ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా జానారెడ్డిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వం అడిగితే సలహాలు ఇస్తాననని జానారెడ్డి బుధవారం మీడియాతో తెలిపారు. దీంతో వీరి భేటీపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. జానారెడ్డి వ్యాఖ్యల వల్లే.. ముఖ్య సలహాదారు పదవి ఆఫర్ చేయడానికి సీఎం వెళ్లారంటూ చర్చించుకుంటున్నారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలతో ఈ భేటీ ప్రాధాన్యతతలను సంతరించుకుంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333