న్యాయవాదులకు ప్రత్యేక పరిరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి

బడ్జెట్లో న్యాయవాదులకు నిధులు కేటాయించాలి
న్యాయవాదుల ఎమ్మెల్సీని ప్రకటించాలి
ఇండియన్స్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఏఎఎల్) రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్
సూర్యాపేట 06 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుచేసి, న్యాయవాదులకు ఎమ్మెల్సీ ని ప్రకటించాలని ఇండియన్స్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ గాని ప్రభాకర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం ఐఏఎల్ జిల్లా కౌన్సిల్ సమావేశం గట్ల నరసింహారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హైకోర్టు, జిల్లా కోర్టు, ఇతర కోర్టులలో మౌలిక సదుపాయాలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేయాలని, బడ్జెట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ అకాడమీ తరహాలో అడ్వకేట్ శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షణలో ఇండియన్స్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నిలబడుతుందని త్వరలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టు పై సెమినార్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఐఏఎల్ ను న్యాయవాదులు బలోపేతం చేసి తమ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఇండియన్స్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పండ్ల రాములు, జిల్లా గౌరవాధ్యక్షుడు నాతిసవీంద్ర కుమార్, జిల్లా అధ్యక్షుడు బొమ్మ గాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తొగిటి మురళి, న్యాయవాదులు తలమళ్ల హస్సేన్, గూడూరి శ్రీనివాస్, రౌతు శ్రీనివాస్, రేగట్టె లింగయ్య, వెంకటరెడ్డి, ఓర్సు రాజు, బానోత్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.