జానకిపురం గ్రామంలో పేద విద్యార్థి మహేష్ కు డాక్టరేట్
అడ్డగూడూరు13 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన బోనాల మహేశ్ పేద రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్య నేర్చి సోషల్ వేల్ఫేర్ భువనగిరిలో ఇంటర్మీడియట్, చేస్తున్న సమయంలో తండ్రి అకాల మరణం చెందిన ఆ బాధను దిగమింగుకొని తన ఇద్దరు సోదరులను ఒక చెల్లెను విద్యావంతులుగా తీర్చిదిద్దుతూనే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే పి జి ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయి లో మొదటి ర్యాంకు సాధించి ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు మాస్టర్ ఆఫ్ ఫిసికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యుజిసి) వారు నిర్వహించే జాతీయ స్థాయి నేషనల్ ఎలిజిబులిటీ(ఎన్ఈటి) ఉత్తిర్ణత సాధించి ఉస్మానియా యూనివర్సిటీ వ్యాయామ విద్య విభాగం పి హెచ్ డి పొంది సీనియర్ ప్రొఫెసర్ బీ సునీల్ కుమార్ పర్యవేక్షణలో "ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టన్స్ ట్రైనింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ మోటర్ ఫిట్నెస్ అండ్ ఫీషియోలాజికల్ వేరియబుల్ అమొంగ్ కబడ్డీ ప్లేయర్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ" అను అంశంను ఎంచుకొని,అధ్యయన పత్రాలు యూనివర్సిటీ కి సమర్పించడం జరిగింది.దానిని పరిశీలించిన ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు విద్యవిభాగంలో అత్యున్నతమైన పట్టా అయిన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్డీ)ని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం వలిగొండ మండలం లోని పులిగిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ టీచర్ గా పనిచేస్తున్నాడు తన పి హెచ్ డి పరిశోధన పూర్తి చేయడం లో సహకరించిన ప్రొఫెసర్ ఎల్ బి కాంత్ రాథోడ్ మాజీ వి సి పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ డీన్ ఫాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రొఫెసర్ దీప్లా ఐయుటి సెక్రెటరీ, రీసెర్చ్ స్కాలర్స్కు, ప్రొఫెసర్లుకు, తల్లిదండ్రులకు తన తోటి మిత్రులందరికీ జానకిపురం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశాడు పి హెచ్ డి పొందిన సందర్భంగా మహేష్ కు జానకిపురం గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.