స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో విజయ దుంధుబి మోగించిన ఎస్.ఆర్ విద్యార్థులు..

Apr 25, 2024 - 19:26
 0  1
స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో విజయ దుంధుబి మోగించిన ఎస్.ఆర్ విద్యార్థులు..

తెలంగాణ వార్త 24 ఏప్రిల్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:- ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో బైరి శ్రీనిధి 49 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిందని ఏ శ్రీ నిత్య 467, యేసుప్రియ 467, కే అమూల్య 467, పి.సాయి శ్రీ 467, నవదుర్గ 467, శ్రీ చరణ్ 467, ఎ. వైష్ణవి 467, శ్రీ రిత్విక్ 467, డి.అక్షర ఇలా తొమ్మిది మంది విద్యార్థులు 470 మార్కులకు వారు 467 మార్కులు సాధించాలని తెలిపారు.466 మార్కులు 18 మంది విద్యార్థులు,465 మార్కులు 12 మంది విద్యార్థులు,465 మార్కులు సాధించిన 40 మంది విద్యార్థులు సాధించారని ఎస్ ఆర్ డి జీ ఎం గోవర్ధన్ రెడ్డి తెలిపారు.ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో రాథోడ్ స్నేహ 438 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. టీ ఫాతిమా 436, ఏం నిత్యశ్రీ 436, దుర్గా 436, డి.వైష్ణవి 436 ఇలా నలుగురు విద్యార్థులు 436 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, కే.రెడ్డి 435 మార్కులు సాధించారు. 430 ఆపై మార్కులు సాధించిన విద్యార్థులు 14 మంది విద్యార్థులు అని తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 10 మార్కులకు గాను 990 మార్కులు తో టాప్ బ్యాంకు సాధించాలని, 980 మార్కులతో 43 మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని తెలిపారు. ఇట్టి ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు బుధవారం ఎస్ ఆర్ కళాశాల గంగస్తాన్ క్యాంపస్ లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీనియర్ అద్యపకులచే విద్య బోధన అందిస్తూ వీక్లీ టెస్ట్ లు నిర్వహించడం సందేహాలను నివృత్తి చేయడం వల్లే స్టేట్ ర్యాంకులు సాధించామని విద్యార్థులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీజీఎం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా అకాడమీ క్యాలెండర్ రూపొందించి సీనియర్ అధ్యాపకులచే విద్య బోధన చేయించి, వీక్లీ టెస్ట్ లు నిర్వహించడంతోపాటు సందేహాలను వివక్తి చేస్తూ నిరంతర పర్యవేక్షణ చేయడం వల్లనే రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం సాధ్యమైందన్నారు. రాబోవు జేఈ మెయిన్ మరియు జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో కూడా ఎస్సార్ నిజాంబాద్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేస్తారని అన్నారు. ఈ సంవత్సరం జరిగే నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో ఎస్సార్ నిజామాబాద్ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించే విధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందా అన్నారు.
కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జి శ్రీకాంత్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా  కాలేజీ ని ఆదరిస్తున్న పేరెంట్స్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తమ సంస్థపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోవు రోజుల్లో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలలో మంచి ర్యాంక్ లు సాధిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హనుమంత్ రావు, ఆగేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి సత్యం, దేవేందర్ రెడ్డి మైపాల్ రెడ్డి అకాడమీ ప్రతాప్ రెడ్డి విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333