వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలాన్ని కబ్జా కాకుండా కాపాడాలి
అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల వినతి

గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అనేక పత్రికలలో వార్తలు వస్తున్న విషయం పట్ల స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్ జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వి.నర్సింహులు కి వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలాన్ని కాపాడాలని వినతిపత్రం అందజేసినారు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవేళ అదే జరిగితే రైతలపక్షణ కబ్జాదారుల మీద ఎంతటి పోరాటం చేయడానికి సరితమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని కబ్జాదారులను హెచ్చరిస్తున్నామని,గద్వాల వ్యవసాయ మార్కెట్ రైతులకు గుండెకాయ లాంటిది అలాంటి ఆక్రమణదారులు ఎంతటి వారైనా రైతుల పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకున్నట్టు గత పది సంవత్సరాల నుండి ఈ తతంగం నడుస్తూనే ఉన్నది..జిల్లా నడిబొడ్డున ఇంత తతంగం నడుస్తున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు,ఈ ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్నది ఎవరు..? వారికి ముట్టిన వాటా ఎంత ఇవన్నీ గద్వాల రైతులకు తెలియాలి వ్యవసాయ మార్కెట్ కాంపౌండ్ కూలగొట్టిన ఇంతవరకు చర్యలు లేవంటే సంబంధిత అధికారులకు వాటా ముట్టిందేమోననిపిస్తుంది, మార్కెట్ అధికారులు స్పందించకపోతే రైతుల పక్షాన సరితమ్మ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు అమరావాయి కృష్ణారెడ్డి, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, అల్వాల రాజశేఖరరెడ్డి,భాస్కర్ యాదవ్, డి.ఆర్.శ్రీధర్, ఖలీం, కృష్ణమూర్తి, కపట్రాల వెంకట్రాములు,నందిన్నె రాజశేఖర్,నారాయణ, వడ్డే కృష్ణ తదితరులు ఉన్నారు...