కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు

Jun 19, 2024 - 13:25
Jun 19, 2024 - 16:45
 0  102
కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు

*కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు*

తెలంగాణ వార్త  ములుగు స్టాప్ రిపోర్టర్  జూన్ /19/ 2024 :-  ములుగు జిల్లా వాజేడు మండలం లో బొల్లారం గ్రామంలో సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ మహేందర్ ఎంపీడీవో విజయలక్ష్మి ఎమ్మార్వో శ్రీనివాసరావు ఎంపీ ఓ శ్రీకాంత్ హెల్త్ సూపర్డెంట్ సూర్య ప్రకాష్ పాల్గోన్నారు వాజేడు డాక్టర్ మహేందర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల చాలా శుభ్రంగా ఉండాలని మరియు దోమతెరలు వాడాలని అందరు మరుగుదొడ్లు వినియోగించుకోవాలని ఆశా వర్కర్లు ఎప్పుడు ఎల్లవేళలా మీ వెనకనే ఉంటారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఎంపీడీవో విజయ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లు మానుకోవాలని మద్యం తీసుకోకూడదని తెలియజేసినారు అందరికీ మరుగుదొడ్లు వచ్చే విధంగా చేస్తానని తెలియజేసినారు మరియు ఎమ్మార్వో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రేషన్ బియ్యం తినటం పౌష్టి ఆహారం కావున అందరూ పౌష్టికాహారాన్ని తినాలి అని తెలియజేసినారు ఇక్కడ ఎక్కువ కంటి చూపుతో బాధపడుతున్నారు కాబట్టి వెంటనే కంటి పరీక్షలు చేయించమని డాక్టర్ గారికి సూచించారు అదేవిధంగా ఎంపీఓ శ్రీకాంత్ మాట్లాడుతూ మన గ్రామంలో అందరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలి ఆరు బయట మలవిసర్జన చేయకూడదు అని తెలియజేసినాడు హెల్త్ సూపర్డెంట్ సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ మన గ్రామంలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ రాకుండా ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు గ్రామస్తులు 70 మంది హాజరైనారు మరియు వాజేడు మండలం కోఆర్డినేటర్ జి కామేష్ వెంకటాపురం మండల కోఆర్డినేటర్ జి హనుమంతు యనిమేటర్స్ భాస్కర్ రమాదేవి స్వరూప ఉషారాణి పాల్గొన్నారు