విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి..

Nov 20, 2024 - 17:23
 0  7
విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి..

జోగులాంబ గద్వాల 20 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఉండవెల్లి రేపు అనగా , గురువారం తేదీ : 21.11.2024 నాడు ఉదయం 10:00 నుంచి 13:00 గంటల వరకు 132KV SS అలంపూర్ సబ్ స్టేషన్ నుండి వెళ్ళు, 33KV అలంపూర్ టౌన్, అలంపూర్ X రోడ్డు మరియు శాంతినగర్-1 ఫీడర్లపై చెట్ల కొమ్మలు తగిలి విద్యుత్ అంతరాయం కలిగించే వాటిని తొలగించడం, ఒరిగిన విద్యుత్ స్తంబాలను సరిచేయడం మరియు ఇంటర్ పోల్స్ వేయడం జరుగుతుంది.  కావున ఆయా ఫీడర్లపై ఉన్న అలంపూర్ సబ్ -డివిజన్ పరిధిలోని ఐదు 33/11KV సబ్ - స్టేషన్లు భీమవరం, అలంపూర్ చౌరస్తా, రామాపురం, చాగాపురం మరియు పెద్ద తాండ్రపాడు లలో  ఉదయం 10:00 గంటల నుండి 13:00 గంటల వరకు విద్యుత్ అంతరాయము కలుగుతుందని తెలియపరుస్తున్నాము. 
కావున విద్యుత్ వినియోగదారులు, రైతులు మరియు రైతుసంఘాలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ వారితో సహకరించగలరని తెలియచేస్తున్నాము.
అలంపూర్, విద్యుత్ శాఖ:
సయ్యద్ మాఖ్బూల్/ADE, 
సుబ్బరాయుడు/AE/మానోపాడ్,
శేఖర్/AE/ఎర్రవల్లి,
శరత్ కుమార్/AE/అలంపూర్,
శివ కుమార్/AE/ఉండవెల్లి. విద్యుత్ ఆఫీసు నుంచి తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333