కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు ఎమ్మెల్యే సామెల్

తిరుమలగిరి 16 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరిలో 14న నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సభను గొప్పగా విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మంగళవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సభకు మహిళలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారని సభను చూసి బిఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డగూడూరు, నాగారం మండలాలకు ప్రభుత్వ కార్యాలయాల మంజూరు చేశారని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు ఫేసు ఆరు నుండి గోదావరి జలాలు తిరుమలగిరి మండలంలోని ఈదులపర్రే తండా, తాటిపాముల, నందాపురం, తిరుమలగిరి, మాలిపురం, అనంతారం గ్రామాలకు సాగునీరు అందించేలా నిర్ణయం చేశారని తెలిపారు. బిఆర్ఎస్ లో ఉన్న ఈ ప్రాంత నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఖాళీ దూలి కి కూడా వారు సరిపోరని విమర్శించారు. దొంగ నోట్ల కేసులో ఉన్న వాళ్ళు కూడా ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. అడ్డగూడూరు నుండి లక్ష్మీదేవి కాలువ బిక్కెరు వాగులో మూడున్నర కిలోమీటర్ల వరకు వాగు లో రోడ్డు ఎందుకు వేశారో సమాధానం చెప్పాలన్నారు. ఇసుకను దోచుకపోవడానికి రోడ్డు వేశారని అన్నారు. పెండింగ్ లో వదిలేసిన చెక్కుడ్యాము లను పూర్తి చేసి రైతులకు సాగునిరు అందించామని అన్నారు. .2001నుండి 2014 వరకు టిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా, నాయకునిగా కొనసాగిన నాకు ద్రోహం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్ ఇస్తే ఈ ప్రాంత ప్రజలు 52 వేల పై చిలుకు మెజారిటీతో గెలిపించాలని చెప్పారు. కాళేశ్వరం కుంగి పోయి నీళ్లు వదిలితే ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన అది బిఆర్ఎస్ పార్టీకి కాళ్ళున్న గుడ్డి వాళ్ళ లాగా ప్రవర్తిస్తున్నారు అని అన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎక్కడ డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పేదలకు ఇల్లు ఇచ్చారని ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలోనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని అన్నారు. 200 యూనిట్లకు ఉచితంగా కరెంటు,సన్న బియ్యం, 500 రూపాయలకే గ్యాస్, అందిస్తున్నామని అన్నారు. ప్రజలు అభిమానంతో రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయడానికి వేలాదిగా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించడానికి ముఖ్యమంత్రి చేత హామీ చేయించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్ల మంజూరుకు హామీ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి సభకు వచ్చిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కాంగ్రెస్ నాయకులకు, ప్రజల అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు వై. నరేష్, పిఎసిఎస్ చైర్మన్ పాలెం చంద్రశేఖర్ ,మూల అశోక్ రెడ్డి, కందుకూరి లక్ష్మయ్య, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.