పట్టణ ప్రజల దాహార్తిని  తీర్చేందుకు  కృషి

Mar 19, 2025 - 19:01
 0  1
 పట్టణ ప్రజల దాహార్తిని  తీర్చేందుకు  కృషి
 పట్టణ ప్రజల దాహార్తిని  తీర్చేందుకు  కృషి
 పట్టణ ప్రజల దాహార్తిని  తీర్చేందుకు  కృషి

అమృత 2.0 లో భాగంగా 41.50 కోట్ల నిధుల మంజూరు...

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా తాళ్లచెరువు నింపేందుకు కృషి...

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు 

కోరుట్ల పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా అమృత్ 2.0 లో భాగంగా కోరుట్ల మున్సిపాలిటీకి 41. 50 కోట్లు మధ్యలో కావడం జరిగిందని దీంట్లో భాగంగా బుధవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు కోరుట్ల పట్టణ విలీన గ్రామమైన ఎకిన్ పూర్ పట్టణ శివారులో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పైపులైన్ ద్వారా తాళ్లచెరువు లో నీళ్ళు నింపడం కోసం ఆర్డీవో మున్సిపల్ కమిషనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా  జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావస్తుందని అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే ఎండాకాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహత్తిని తీర్చడం కోసం అమృత్ 2.0 లో భాగంగా కోట్ల రూపాయల నీరు మంజూరు చేయడం జరిగిందని దీనిలో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా తాళ్లచెరువును నింపడం కోసం రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించడం జరిగిందని ఇందులో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఏమైనా నష్టం జరిగితే ప్రభుత్వం ద్వారా అందజేసేలా కృషి కృషి చేస్తానన్నారు కావున రైతులు సహకరించాలని కోరారు అలాగే రాబోయే ఎండాకాలన్ని దృష్టిలో ఉంచుకొని కోరుట్ల పట్టణంలో గల 33 వార్డులకు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ప్రత్యేక నిధుల ద్వారా 33 బోర్లు మంజూరు చేయడం జరిగిందని వాటిని త్వరలోనే వేసేలా కృషి చేస్తామన్నారు అలాగే తాళ్లచెరువు కంచేరకుంట మద్దుల చెరువు లలో త్వరలోనే పూడిక తీయడం జరుగుతుందన్నారు అనంతరం ఆర్డీవో జీవాకర్ రెడ్డి మాట్లాడుతూ అమృత్ 2.0 లో భాగంగా చేపట్టబోయే పైపుల నిర్మాణం ద్వారా భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా చూస్తామని అంతే కాకుండా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి త్వరలోనే పనులు ప్రారంభించేలా కృషి చేస్తామన్నారు అనంతరం కమిషనర్ రామకృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని కోరుట్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్ 2.0 లో భాగంగా ప్రభుత్వం ద్వారా 41.50 కోట్ల నిధులు మంజూరు కావడం జరిగిందని ఇట్లు నిధుల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా తాళ్లచెరువును నింపి తద్వారా ఫిల్టర్ బెడ్ ద్వారా పట్టణ ప్రజలకు మంచినీరు అందేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తో పాటు కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి జీవాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ మున్సిపల్ డిఈ ఏఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ ఏఈ కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ పట్టణ కాంగ్రెస్  నాయకులు అన్నం అనిల్  మచ్చ కవిత మ్యాకల నర్సయ్య  ఎంబేరి సత్యనారాయణ  పుప్పాల ప్రభాకర్ శీలం వేణుగోపాల్ సంఘ లింగం జిందం లక్ష్మీనారాయణ మోర్తాడ్ లక్ష్మీనారాయణ శోగ్రాభి సదుల వెంకటస్వామి చిట్యాల లక్ష్మీనారాయణ రియాజ్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్త తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333