శాంతి, సామరస్యాలకు ప్రతీక క్రిస్మస్..

Dec 24, 2024 - 23:09
Dec 24, 2024 - 23:13
 0  48
శాంతి, సామరస్యాలకు ప్రతీక క్రిస్మస్..
శాంతి, సామరస్యాలకు ప్రతీక క్రిస్మస్..

క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరనీయం..

ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు..

 తెలంగాణ రాష్ట్ర జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ 

సూర్యాపేట, 25 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :- శాంతి, సామరస్యాలకు ప్రతీకగా జరుపుకునే క్రీస్తు జననం పండుగ క్రిస్మస్ అని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఈసందర్బంగా అయన ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమాజంలో క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరనీయమని.. ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అయన బోధనల ద్వారా మానవాళి సన్మార్గం వైపు నడవాలన్నారు. క్రీస్తు పుట్టిన రోజున క్రైస్తవ సోదరులు అత్యంత ఘనంగా క్రిస్మస్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఏసుక్రీస్తుకు ప్రార్థనలు చేయాలని క్రైస్తవులను కోరారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమా, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని కోరుతూ ప్రశాంతవతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు.  తన కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి తన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జలగం రమేష్ జలగం కిరణ్  పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి జిల్లా కార్యదర్శి మందాడి గోవర్ధన్ గౌడ్ గిరి గిరీశం బుర్ర శ్రీనివాస్ రాపర్తి సురేష్ పట్టణ కార్యదర్శి పట్టేటి కిరణ్ పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న సాలగండ్ల కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333