కర్రు కాల్చి వాత పెట్టే టైమ్ వచ్చింది ` *కాంగ్రెస్ పార్టీకి

Mar 22, 2024 - 16:25
Mar 22, 2024 - 21:27
 0  14
కర్రు కాల్చి వాత పెట్టే టైమ్ వచ్చింది  ` *కాంగ్రెస్ పార్టీకి

కర్రు కాల్చి వాత పెట్టే టైమ్ వచ్చింది ` *కాంగ్రెస్ పార్టీకి* `

తెలంగాణ వార్త ప్రతినిధి:-మార్చి 22 2024:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో విలేకర్ల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను 100రోజులలో పూర్తి చేస్తానని చెప్పి విఫలమైందనీ అన్నారు . ఆరు లో ఒకటి ఫ్రీ బస్ పెట్టి ప్రజలను కొట్టుకునేవిధంగా ఉందని మహీలకు 2500 ఎటు పోయాయని, రైతు బంధు ఎటు పోయిందని, పించన్ 2000ఎప్పుడూ పెంచుతారాని,వందరోజులలో 6గ్యారంటిలు ఇస్తానని మోసం చేసిందని అన్నారు . ఈ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలించాలని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, లేదంటే ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని చీర్చి చెండాడుతుందని , ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు హామీలను నెరవేర్చకుండా ఇంటికి వస్తే కర్రు కాల్చి వాత పెట్టమని వార్నింగ్ ఇచ్చాడు. ప్రజలు ఇకనైనా మేల్కొని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వచ్చే ఎంపీ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ ని గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెబుతారని, హెచ్చరించారు . ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.