చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు

Jun 10, 2024 - 19:36
 0  7
చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  సిపిఐ (ఎం_ఎల్) న్యూడెమోక్రసీ రామన్నగూడెం గ్రామ సీనియర్ నాయకులు కామ్రేడ్ బురెడ్డి సంజీవరెడ్డి గత పది రోజుల క్రితం అమరత్వం చెందారు. ఆయనను స్మరించుకుంటూ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. *ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య* పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ సంజీవరెడ్డి రామన్నగూడెం గ్రామంలో విప్లవ రాజకీయాలను ఎంపిక చేసుకొని తన చివరి శ్వాస వదిలే వరకు నిలబడిన గొప్ప మనిషిని అన్నారు. పార్టీ కార్యక్రమాలకు నిరంతరం హాజరవుతూనే గ్రామంలో తన వంతు ఉద్యమ విస్తరణకు తోడ్పడ్డాడని, అందర్నీ ఐక్యంగా ఉంచుటకు కృషి చేశాడని అన్నారు. ఉన్నత వర్గ కుటుంబంలో జన్మించిన పేదల పక్షాన విప్లవ రాజకీయాలతో పనిచేశాడని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. *ఈ కార్యక్రమంలో పార్టీ సబ్ డివిజన్ నాయకులు కొండేటి సంజీవరెడ్డి, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు పుల్లూరు సింహాద్రి, పిడిఎస్ యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, పార్టీ గ్రామ కార్యదర్శి వీరారెడ్డి, నాయకులు సోమారపు పిచ్చయ్య, అయితగోని సైదులు, మాచిరెడ్డి, బత్తుల పిచ్చయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు