ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘటన చరిత్రలో ఏనాడు లేదు
రైతులకు ఎస్సారెస్పీ ఫేస్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారు
హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసింది
ప్రభుత్వాన్ని నమ్మి ఒక్కో రైతు 25 నుండి 30 వేల పెట్టుబడి పెట్టి ఆగమయ్యారు
ప్రభుత్వం అవగాహన రాహిత్యం వలన రైతులు రోడ్డు మీద పడ్డారు
జాలువారిన పంట పొలాలు నేడు మోడు వారడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే
పోరాడి సాధించిన తెలంగాణలో కేసీఆర్ రైతాంగాన్ని సస్యశ్యామలం చేస్తే మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసింది
కాలేశ్వరం నీళ్లు ఎత్తిపోయడానికి మూడు పిల్లర్ల కుంగుబాటుకు సంబంధం లేనప్పటికీ గత ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు
రైతుబంధు రాలేదని ప్రశ్నించిన రైతును మంత్రి చెప్పు తీసుకొని కొడతాననడం దుర్మార్గం
రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ మంత్రులు కనీసం సమీక్ష చేయడం లేదు
పంట నష్టం పై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వాలి
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్
ఉమ్మడి జిల్లా లో కొనసాగుతున్న మాజీ మంత్రి , శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పర్యటన
రైతుల కోరిక మేరకు వరుసగా ఐదో రోజు కరువుతో ఎండిన పంటలను పరిశీలిస్తున్న జగదీష్ రెడ్డి
సూర్యాపేట మండలం యార్కారం,దుబ్బ తండ , రెఖ్యా నాయక్ తండాలో ఎండిన పొలాల పరిశీలన
రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న జగదీష్ రెడ్డి
సూర్యాపేట:- ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘటన చరిత్రలో ఏనాడు లేదని, మాట ఇచ్చి రైతన్నల నడ్డి విరిచిన అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మండిపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అవగాహన లోపంతో ఎండిపోయిన పంటలను వరసగా 5వ రోజు జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఎండిపోయిన పంటలను పరిశీలించాలని రైతన్నల కన్నీటి ఆహ్వానం మేరకు సూర్యాపేట మండలం యార్కారం,దుబ్బ తండ , రెఖ్యా నాయక్ తండాలో ఎండిన పొలాల పరిశీలించిన ఆయన రైతుల ఇబ్బందులను చూసి చలించి పోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి
ప్రభుత్వం రైతులకు ఎస్సారెస్పీ ఫేస్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారని,హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసింది దని విరుచుకుపడ్డారు.
ప్రభుత్వాన్ని నమ్మి ఒక్కో రైతు 25 నుండి 30 వేల పెట్టుబడి పెట్టి ఆగమయ్యారని అన్నారు.
ప్రభుత్వం అవగాహన రాహిత్యం వలన రైతులు రోడ్డు న పడ్డారని పేర్కొన్నారు. మా ప్రభుత్వం హయాంలో
మొన్నటి వరకు జాలువారిన పంట పొలాలు నేడు మోడువారడానికి కారణం నూటికి నూరు శాతం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు.పోరాడి సాధించిన తెలంగాణలో కేసీఆర్ రైతాంగాన్ని సస్యశ్యామలం చేస్తే మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందన్నారు.కాలేశ్వరం నీళ్లు ఎత్తిపోయడానికి మూడు పిల్లర్ల కుంగుబాటుకు సంబంధం లేనప్పటికీ గత ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదన్నారు.రైతుబంధు రాలేదని ప్రశ్నించిన రైతును మంత్రి చెప్పు తీసుకొని కొడతాననడం దుర్మార్గం అన్నారు. మా ప్రభుత్వ హయాంలో రైతు తప్పిదం వలన ఒక్క మడి ఎండిపోతేనే నాన్న హంగామా చేసిన డిప్యూటీ సీఎం విక్రమార్క గారు, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ మంత్రులు కనీసం సమీక్ష చేయకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న మొసలి కన్నీళ్ళకు నిదర్శనమన్నారు.
పంట నష్టం పై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.