అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్
అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్
వాజేడు నవంబర్ 16 తెలంగాణ వార్త:- మండల కేంద్రంలో పేరూరు గ్రామపంచాయతీ పరిధిలో చిన్న గొల్లగూడెం గ్రామంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా పేరూరు వైకింగ్స్ వారియర్స్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టింగా బుచ్చయ్య పాల్గొని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి శుక్రవారం క్రీడలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుందని, ఈ క్రీడలు యువతకు ఎంతో మేలు చేస్తుందని, యువత సన్మార్గంలో నడవాలని చెడు వ్యసనాలకు బానిసలై ఉజ్వాల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. కుంట నర్సింహారావు మేనేజ్మెంట్ గా నిలబడి గత 15 సంవత్సరాల నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్ దసరా, సంక్రాంతి పండుగలకు తప్పనిసరిగా తన వంతు కృషిచేసి ఈ క్రీడలను నిర్వహిస్తారు. నరసింహారావును పలువురు క్రీడాభిమానులు అభినందించారు.ఈ కార్యక్రమంలో బొల్లె ఆదినారాయణ, డర్ర గణేష్, ఎర్రావుల చిన్నన్న, తొరెం సంతోష్ , బొల్లె సంతోష్ ,యువత పలువురు క్రీడాకారులు క్రీడాభిమానులు,నాయకులు పాల్గోన్నారు.