సిపిఐ పార్టీ ఏఐటిసి ఆధ్వర్యంలో మేడే దినోత్సవం వేడుకలు

May 1, 2025 - 17:55
May 1, 2025 - 20:32
 0  3
సిపిఐ పార్టీ ఏఐటిసి ఆధ్వర్యంలో మేడే దినోత్సవం వేడుకలు
సిపిఐ పార్టీ ఏఐటిసి ఆధ్వర్యంలో మేడే దినోత్సవం వేడుకలు

బంటు వెంకటేశ్వర్లు సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు

తెలంగాణ వార్త మిర్యాలగూడ మే 1 : ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గవ్యాప్తంగా మేడే దినోత్సవం వేడుకలు ఘనంగానిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సయ్యద్ ,వారు మాట్లాడుతూ కార్మికు అండా ఎర్రజెండా ఈ ఎర్రజెండా ద్వారానే ప్రజా పోరాటాలు చేసి వారు హక్కులు సాధించుకున్నారని వారన్నారు  ఈరోజు 139వ మేడే ను అమరవీరుల స్ఫూర్తితో జరుపుకుంటూ వారు చేసిన త్యాగ ఫలితాలు ఈరోజు కార్మికుఅండగాఉంటుందని వారన్నారు ప్రపంచ కార్మికులారా ఏకంకండి పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదంతో మన హక్కుల కోసం ప్రభుత్వాల మీద ప్రజా పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు కార్మికుల హక్కులను కాపాడాలంటే ఈ దోపిడి  పాలనను అంతం చేయాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి కార్మికులు ఆనాడు 18 గంటల  పని విధానాన్ని తగ్గించాలని కార్మికుల మధ్య పెట్టుబడిదారీలో మధ్య సుదీర్ఘమైనటువంటి పోరాటాలు జరిగినవి ఆ పోరాటంలో వేలాది మంది అమరులైనారు బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడలు రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని పిఎఫ్ఐ ఈఎస్ఐ గ్రాటివిటీ బోనస్ పెన్షన్ చట్టాలు అమలు చేయాలని హమాలీ ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమగ్ర చట్టం చట్టాన్ని తేవాలని 30000 సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని భవన నిర్మాణ కార్మికులకు మరణానికి 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షణ కోసం బ్యాంకులువిలియం చేయాలని గ్రామపంచాయతీలో పని చేస్తున్న కార్మికులకు పర్మినెంట్ చేసి 26 వేల రూపాయలు జీతం ఇవ్వాలని కార్మికులు ఇంకా అనేకమైన డిమాండ్స్ సాధించుకొనుటకు ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఒక తాటిపైకి వచ్చి మనమందరం కలిసి ప్రజా పోరాటాలు చేసి సాధించుకోవాలని వారన్నారు నేటికీ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల చిన్నచూపు చేస్తూనే ఉందన్న వారన్నారు రేపు 20వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వ విధానాల మీద అన్ని కార్మిక సంఘాలు బందు కు పిలుపు ఇవ్వడం జరిగింది మనందరం కలిసి కేంద్ర ప్రభుత్వం కన్నులు తెరిచే విధంగా అన్ని వర్గాల ప్రజలు బందుకు సహకరించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బిల్లా కనకయ్య , డి హెచ్ పి ఎస్ నాయకులు వల్లంపట్ల వెంకన్న, మండల సహాయ కార్యదర్శి అంజననపల్లి రామలింగం, మండల సమితి సభ్యులు గోగుల యాదగిరి,  రైతు సంఘం జిల్లా సమితి సభ్యురాలు ఎర్రబోతు పద్మ ,మహిళా సమైక్య నాయకురాలు ఎస్కే షమీం, లింగంపల్లి సైదమ్మ ,ఎర్ర ప్రమీల, సులోచన, చలి కంటి సైదమ్మ,  మచ్చ శైలజ, చింతమల రాములు, ముత్తులింగం, ఎయిర్ రాములు ,లక్ష్మమ్మ, వెంకటమ్మ మర్రి తిరుపతయ్య ,మల్లమ్మ ,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333