ఐజ మండల శ్రీకృష్ణవేణి ప్రైవేట్ స్కూల్స్ అనుమతి ని రద్దు చేయాలి

Jun 27, 2025 - 15:11
 0  3
ఐజ మండల శ్రీకృష్ణవేణి ప్రైవేట్ స్కూల్స్ అనుమతి ని రద్దు చేయాలి

ఐజ మండల MEO ని విధుల నుండి తొలగించాలి.

జిల్లా జిల్లా కలెక్టర్ కి వినతిపత్రంను అందించిన విద్యార్థి సంఘాలు.

పట్టపగలే నడిరోడ్డు మీద శ్రీ కృష్ణవేణి ప్రయివేట్ స్కూల్ యజమాని పాఠ్యపుస్తకాలు నోటుబుక్కులు అమ్ముతా ఉంటే ఎంఈఓ చర్యలు తీసుకోకపోవడం పైన జిల్లా కలెక్టర్ కిఫిర్యాదు

BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

జోగులాంబ గద్వాల 26 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల నిన్న అలంపూర్ నియోజకవర్గం ఐజ మండల కేంద్రంలోని కృష్ణవేణి ప్రైవేటు హైస్కూల్ కు సంబంధించిన యజమాని స్కూలుకు పక్కనే ఫేక్ సర్టిఫికెట్ పేరు మీద బుక్ సెంటర్ ను ఓపెన్ చేసుకొని పట్టపగలే నడిరోడ్డు మీద బుక్కులు అమ్ముతా ఉంటే మేము వెళ్లి పట్టించి డీఈఓ కి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే డిఈఓ ఎంఈఓ కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ స్కూలు బుక్స్ ను సీజ్ చేయమని, అయితే ఎంఈఓ డీఈవో ఆదేశాలు కూడా లెక్క చేయకపోవడం అంటే దీనిని ఏమనాలి అని అన్నారు ?

 ఎంఈఓ  మాట్లాడుతూ నాకు ప్రొటెక్షన్ ఇస్తే వస్తాను అనడం విడ్డురంగా ఉంది.
అడ్డంగా దొరికిన కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఇది విద్యా వ్యవస్థకు సిగ్గుచేటు.
 అధికారులే ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తే మరియు ప్రభుత్వ బడులు ఏం కావాలి అని అన్నారు.

ఐజ మండలం శ్రీ కృష్ణవేణి హై స్కూల్ యాజమాన్యం నడి బజార్లో పెట్టి పాఠ్య పుస్తకాలు అమ్మిన యాజమాన్యం

ఈ విషయంపై జిల్లా విద్యాధికారి చర్యలు తీసుకోమని MEO కు తెలుపగా చర్యలు తీసుకోని విద్యాధికారి

బుక్స్ స్కూల్  కు 40 మీటర్ల దూరంలో ఒక షాప్ ఏర్పాటు చేసుకొని అమ్ముతున్న యాజమాన్యం

DEO ఆదేశాలు భేఖాతరు చేసిన MEO

బోనఫైడ్, టీసి లకు 10వ తరగతి విద్యార్థులకు 2000/-వరకు వసూలు

ఫీజులు ఇస్టారీతిన పెంచిన యాజమాన్యం 

10 వ తరగతి 2024-25 లో 28000/- ఫీజు ఉంటే 2025-26 విద్యా సంవత్సరం లో 34000/- వరకు పెంపు.

అదేవిధంగా ఈరోజు ఆ స్కూల్లో పనిచేస్తున్న వర్కర్స్ ను టీచర్స్ డ్రైవర్స్ ను తీసుకువెళ్లి ఎంఈఓ ఆఫీస్ వద్ద ధర్నా చేయించి దానికి MEO సపోర్ట్ చేయడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని డిమాండ్ చేశారు.

 ఒక మండల విద్యాధికారి కింద కూర్చొని ఆ స్కూల్ యజమానానికి సపోర్ట్ చేయడం అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని అన్నారు.

తక్షణమే ప్రవేటు స్కూల్ ల పైన కఠినమైన చర్యలు తీసుకొని స్కూల్ ల యొక్క అనుమతులు రద్దు చేసి meo ను విధుల నుంచి తొలగించలని డిమాండ్ చేశారు. 

కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన విద్యార్థి సంఘాల నాయకులు BRSV జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, PDSU జిల్లా అధ్యక్షులు హాలీమ్ పాషా, వామనపల్లి రంగస్వామి, హరీష్, కొమ్ము రంగస్వామి

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333